క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేయూ క్యాంపస్ / నర్సంపేట, మార్చి 15: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కరీంనగర్ జాతీయ రహదారిపై చింతగట్టు కెనాల్ క్యాంప్ వద్ద కేఎల్‌ఎన్ ఫంక్షన్‌హాల్ ఎదురుగా ఉన్న డివైడర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కక్కడే మృతి చెందారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఎస్సై భీమేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో కాజీపేట సొమిడి గ్రామానికి చెందిన గుర్రం రంజిత్(27),పూసల రంజిత్(23) ద్విచక్ర వాహనంపై సొమిడి నుండి హాసన్‌పర్తి వైపునకు గురువారం తెల్లవారుజామున వెళ్తుండగా కేఎల్‌ఎన్ ఫంక్షన్ హాల్ వద్ద చనిపోయి పడియున్న కుక్కను తప్పించబోయి డివైడర్‌ను ఢీ కొట్టారు. దీంతో అదుపు తప్పిన ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొట్టడంతో తలలకు తీవ్ర గాయాలు అయ్యి ఆ ఇద్దరు అక్కడిక్కక్కడే మృతిచెందారు. గుర్రం రంజిత్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా పూసల రంజిత్ కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భీమేష్ తెలపారు

లక్నెపల్లి శివారులో..
నర్సంపేట మండలంలోని లక్నెపల్లి శివారులో గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. నల్లబెల్లి మండలంలోని మామిండ్ల వీరయ్యపల్లెకు చెందిన కొడుదూరి రాజు (36) వరంగల్ నగరంలోని గొర్రె కుంట సుందరయ్యనగర్ కాలనీలో ఉంటున్నాడు. అక్కడే కారు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా గురువారం మధ్యాహ్నాం తన బజాజ్ ప్లాటీనా ద్విచక్రవాహనంపై ఖానాపురం మండలంలోని ధర్మరావుపేటకు బంధువుల దిన కార్యక్రమానికి వచ్చాడు. రాత్రి తిరిగి ద్విచక్రవాహనంపై వరంగల్‌కు బయలుదేరాడు. నర్సంపేట మండలంలోని లక్నెపల్లి శివారులో హన్మకొండకు వెళుతున్న ఆర్టీసీ మెట్రో బస్సును ప్రయాణికులకు టికెట్ల జారీ కోసం రోడ్డు పక్కన డ్రైవర్ నిలిపివేశాడు. అయితే వెనుక నుండి ద్విచక్రవాహనంపై అతివేగంతో వచ్చిన రాజు ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాజు తల పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. కొద్ది నిమిషాల్లోనే రాజు అక్కడిక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని టౌన్ సీఐ కొత్తదేవేందర్‌రెడ్డి సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట మార్చురీకి తరలించారు.