వరంగల్

రూ.105 కోట్ల రుణ సహాయం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 22: జిల్లాలోని మహిళా సంఘాలకు మార్చి నెలాఖరులోగా లక్ష్యాన్ని మించి బ్యాంక్ ఋణ సహాయాలు అందించాలని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ఆమె పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు మరియు వివిధ శాఖల ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద అందిస్తున్న ఋణ సహాయాన్ని ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అనుసంధానం చేస్తూ స్వయం పథకం క్రింద అందిస్తున్న ఋణ సహాయ పథకాలను గ్రౌడింగ్ చేయడంలో కొన్ని బ్యాంకు శాఖలు సంతృప్తికరంగా గ్రౌడింగ్ చేయడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వివిధ పథకాల క్రింద బ్యాంకర్లకు సబ్సిడీలను విడుదల చేయడం జరిగిందని, అయితే వాటిని గ్రౌడింగ్ చేయడం లో కూడా అలసత్వం వహిస్తున్నారని అన్నారు. గత 2 సంవత్సరాల కాలంలో ఎస్సీ కార్పోరేషన్, బిసి కార్పోరేషన్, గిరిజన అభివృద్ధి సంస్ధ, మైనార్టి మరియు జిఎం ఇండస్ట్రిస్ ద్వారా వివిధ పథకాల కింద లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్ కాస్ట్‌తో సహా ఆయా బ్యాంక్ శాఖలకు లక్ష్యాన్ని నిర్ధేశించి టార్గెట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లను వెంటనే భౌతికంగా గ్రౌడింగ్ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆమె కోరారు. ఆయా బ్యాంకులకు జిల్లా స్ధాయిలో ప్రత్యేకంగా లభ్ధిదారులను ఎంపిక చేసే వివిధ పథకాల క్రింద ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా యూనిట్లు గ్రౌండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో మహిళా సంఘాలకు ఈ ఆర్ధిక సంవత్సరంలో 105 కోట్ల ఋణ సహాయం అందిచాలని లక్ష్యంగా నిర్ధారించడం జరిగిందని అన్నారు. ఈ రోజు వరకు 98 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని మిగితా 7 కోట్ల ఋణ సహాయాన్ని ఈ నెలాఖరులోగా మహిళా సంఘాలకు అందించి లక్ష్యాన్ని మించి మహిళ సంఘాలకు ఋణ సహాయం అందించాలని అన్నారు. బ్యాంకుల వారిగా , శాఖ వారిగా పర్య వేక్షించి వచ్చే వారం రోజుల్లో లక్ష్యాన్ని అధిగమించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా శ్రీనిధి పథకం కింద మహిళలకు విరిగా ఋణ సహాయం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎవి మంగపతిరావు, బ్యాంక్‌ల ప్రగతి నివేదికను సమావేశంలో వివరించారు. ఈఈ సమావేశానికి జిల్లాలోని వివిధ శాఖల అధికారులుతోపాటు ఎస్‌ఎల్‌బిసి ఎన్ రవీకుమార్, పిడిడిఆర్‌డిఎ రాము, ఆర్‌ఎమ్‌ఎస్‌బిఐ టివి రమణ, ఎజిఎమ్ ఆర్‌బిఐఎం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.