వరంగల్

భూపాలపల్లి జిల్లాను మలవిసర్జన రహిత జిల్లాగా మార్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి/నర్సంపేట, మార్చి 23: అక్టోబర్ 2వ తేదీలోగా జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మార్చాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ దుగ్యాల ఆమయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్‌లో భాగంగా జిల్లాలో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ప్రగతిపై శుక్రవారం జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఉపాధి హామీ పథకం ఏపీవోలతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 60వేల వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రభుత్వం మంజూరు చేయగా వాటిలో ఇప్పటి వరకు 36వేల మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రగతిలో ఉన్నాయని చెప్పారు. మిగతా మరుగుదొడ్ల నిర్మాణాల కోసం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి అడ్వాన్సుగా నిధులను మంజూరు చేసి నిర్మాణాలను చేపట్టాలన్నారు. మండలాల వారిగా నిర్ణయించిన లక్ష్యం మేర మరుగుదొడ్లను నిర్మించి అక్టోబర్ 2 గాంధీ జయంతిలోగా జిల్లాలో గల అన్ని నివాసాలలో మరుగుదొడ్ల నిర్మాణాల జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాలతో మరుగుదొడ్లను నిర్మించుకునేలా ప్రజలను చైతన్య పర్చాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోని వారికి రేషన్ కార్డులు, ఇళ్లకు విద్యుత్ సౌకర్యాన్ని నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి రవికిరణ్, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, ఏపీవో వసంతరావు, ఎంపీడీవోలు, ఏపీవోలు, స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.