వరంగల్

ఎమ్మెల్యే దొంతికి ఉద్యోగుల సహాయ నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 23: వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరితపై నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేసిన అనుచిత వాఖ్యల పట్ల ఉద్యోగ సంఘలు ఆందోళనకు దిగాయి. శుక్రవారం రూరల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన అత్యవసర సమావేశంలో ఉద్యోగ సంఘాలన్ని సమావేశం అయ్యాయి. ఈ కార్యక్రమానికి టి జాక్ ఉమ్మడి జిల్లాల ఛైర్మన్ పరిటాల సుబ్బారావు పాల్గొని మాట్లాడుతూ రూరల్ జిల్లా కలెక్టర్ హరితపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేసిన అనుచిత వాఖ్యలకు నిరసన తెలుపుతూ ఉద్యోగులందరు సహాయ నిరాకరణ చేస్తునట్లు ప్రకటించారు. గతంలో కూడా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలెక్టర్లపైన అనుచిత వాఖ్యలు చేసిన సంఘటనుల ఉన్నాయని గుర్తుచేశారు. ఎమ్మెల్యే చర్యలు నిరసిస్తూ నేటి నుండి ఎమ్మెల్యే పాల్గొనే అధికారిక కార్యక్రమాలన్ని బహిష్కరిస్తూనట్లు వెల్లడించారు. ఈ సంఘటనకు ఎమ్మెల్యే మాధవరెడ్డి బాధ్యత వహిస్తూ కలెక్టర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా టిఎన్‌జివోస్ కో- ఆర్డీనేటర్ కోలా రాజేశ్‌కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లాల టిజివోఎస్ యూనియన్ కో- ఆర్డీనేటర్ జగన్‌మోహన్ రావు, వరంగల్ రూరల్, నర్సంపేట ఆర్డీవోలు సిహెచ్. మహేందర్‌జీ, ఎం. రవితో పాటు అనేక ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా ఉద్యోగుల ఆందోళన వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేకనే అధికార పార్టీ నాయకులు గొరంతను కొండంతులు చేసి ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సంఘటన ఒక పథకం ప్రకారమే జరుగుతోందని అంటున్నారు.
అధునాతన సాంకేతికతను ఉపయోగించాలి
కేయు, క్యాంపస్, మార్చి 23: కేయు సెరికల్చర్ విభాగం ఆధ్వర్యంలో సెరికల్చర్ సుస్ధరాభివృద్ధికై నూతన సాంకేతిక వినియోగం అనే అంశంపై రెండు రోజుల సదస్సును శుక్రవారం ఉదయం నిర్వహించారు. జంతు శాస్త్రం విభాగం సెమినార్ హాల్లో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కే పురుషోత్తం ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన కావించి ప్రారంభించగా డాక్టర్ వెంకయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెరికల్చర్ రంగంలోవస్తున్న మార్పులను రైతులు అవగతం చేసుకోవాలని అన్నారు. కేయులో సెరికల్చర్ విభాగభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కేయు విశ్రాంతాచార్యులు సెరికల్చర్ విభాగ వ్యవస్థాపకులు ఆచార్య ఏపిరావు మాట్లాడుతూ పట్టుపరిశ్రమకు ఉజ్వల భవిష్యత్ ఉందని అన్నారు. తెలంగాణ సెరికల్చర్ పరిశోధన విస్తరణ కేంద్రాన్ని కేయులో ఏర్పాటు చేస్తే పట్టు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. గౌరవ అతిధిగా పాల్గొన్న వరంగల్ భూపాలపల్లి జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ పట్టు రైతులు సాప్ట్‌వేర్ ఇంజనీర్లతో సమానంగా సంపాదన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కనిజ్ ఫాతిమా, డాక్టర్ జి. షమిత, రాజేందర్, మల్లీఖార్జున్ పరిశోధకులు పాల్గొన్నారు.