వరంగల్

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, మార్చి 24: జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై గత వారం రోజులుగా పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. నర్సంపేటలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడారు. రిజర్వేషన్లు యాభై శాతానికి మించొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. ఇదే సమయంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, కొత్త రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలని మూడు ప్రధాన డిమాండ్లతో పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరి కాదన్నారు. నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్‌లో సైనిక స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 2019 విద్యాసంవత్సరాని గాను ఐదవతరగతిలో 80 అడ్మీషన్లు, ఇంటర్‌లో 80 అడ్మీషన్లు ఉంటాయని తెలిపారు. ఏటూరునాగారంలో స్పోర్ట్స్ స్కూల్ మంజూరు అయిందని వెల్లడించారు. రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాజ్యసభ ఎన్నికలలో తన ఓటును చూపించి ఓటు వేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఇలా చేసి నియోజకవర్గ ప్రజల మనోభావాలను ఎమ్మెల్యే దొంతి దెబ్బతీశారని విమర్శించారు. 35 ఏళ్ల నుండి రాజకీయాలలో ఉన్న ఎమ్మెల్యే దొంతికి కనీసం ఓటు వేసే విధానం కూడా తెలియకపోవడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొనసాగుతున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించలేదని, రాజ్యసభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వతంత్ర అభ్యర్థి అని మాత్రమే ఉందని చెప్పారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిలు నిత్యం ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అనంతరం 19 మందికి ఐదు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంపీ సీతారాంనాయక్, సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డిలు పంపిణీ చేశారు. ఈవిలేఖరుల సమావేశంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకుడు రాయిడి రవీందర్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.