వరంగల్

రాష్ట్ర ప్రభుత్వానిది రాజకీయ వ్యభిచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, మార్చి 24: కాంగ్రెస్ పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా కొనసాగుతున్న తాను రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ఆ ఓటును తిరస్కరించడం అనైతికమని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందని ఏఐసీసీ సభ్యుడు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విమర్శించారు. నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారని, స్వయంగా కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత కుందూరు జానారెడ్డి అసెంబ్లీ కార్యదర్శితో పాటు శాసనసభ స్పీకర్‌కు లిఖిత పూర్వంగా తెలియజేశారని చెప్పారు. గతంలో శాసన మండలి ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలితకు ఓటు వేసి గెలిపించానని అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నూటికి నూరు శాతం తన వెంటే ఉన్నారని, గత ఎన్నికలలో తనకు వచ్చిన ఓట్లలో తొంబై శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీవి కాగా మిగిలిన పదిశాతం ఓట్లు అభిమానులు, సానుభూతిపరులవని చెప్పారు. ఈ క్రమంలో రాజనీతి పాటించి కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినా కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని, పార్టీ ఫిరాయించిన వారి ఓట్లను పరిగణనలోకి తీసుకుని తన ఓటును తిరస్కరించడం అప్రజాస్వామ్యమని అన్నారు. స్వతంత్ర సభ్యుడినైన తనకు ఎలాంటి విప్ ఉండదని, అయితే పార్టీ ఫిరాయించిన వారిపై శాసనసభ స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో నర్సంపేటలో అధికార పార్టీ నాయకులు గాంధీ విగ్రహం ఎదుట దీక్ష చేయడం సిగ్గుచేటన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లతో గెలిచినందుకు దీక్ష చేస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. అధికార పార్టీ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిలు రాత్రి, పగటి వేషగాళ్ల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈవిలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పట్టణ అధ్యక్షుడు పెండెం రామానంద్, జడ్పీటీసీ ఎడ్ల జగన్మోహన్‌రెడ్డి, నాయకులు హింగే మురళీ, తోకల శ్రీనివాస్‌రెడ్డి, కొమ్ము రమేష్‌యాదవ్, సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, పుల్లూరి స్వామి, తక్కళ్లపల్లి రమేష్, కోల చరణ్, తుమ్మలపల్లి సందీప్, చింతల సాంబిరెడ్డి పాల్గొన్నారు.

- వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి -
అధికారులు కృషి చేయాలి
* కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి దుర్గశంకర్ మిశ్రా
భూపాలపల్లి/నర్సంపేట, మార్చి 24: వెనుకబడిన జిల్లాలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నిలిపేలా కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గశంకర్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నీతిఅయోగ్‌లో దేశ వ్యాప్తంగా 115 జిల్లాలను వెనుకబడ్డ జిల్లాలుగా గుర్తించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో వెనుకబడిన జిల్లాలైన భూపాలపల్లి, కొమురంభీం, ఖమ్మం జిల్లా అధికారులతో శనివారం సమావేశం కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గశంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల అభివృద్దికి అవసరమైన తగు సూచనలు, సలహాలను అధికారులను అడిగి తెలసుకున్నారు. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి దుర్గ శంకర్ మిశ్రా మాట్లాడుతూ ముఖ్యంగా విద్యా, ఆరోగ్య, పౌష్టికాహారం, వౌళిక వసతుల కల్పన, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలైన హార్టికల్చర్, పశుసంవర్ధక శాఖలు, యువత వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేసి జిల్లాలోని ప్రజల అభివృద్దికి కృషి చేయాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పై అంశాలకు ప్రాధాన్యత ఇస్తుండడం.. నీతి అయోగ్‌చే గుర్తించబడ్డ జిల్లాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుందని చెప్పారు. దీని ద్వారా జిల్లాల ప్రజలకు ఎంతగానో మేలు చేకూరుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అజయ్‌కుమార్, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి, భూపాలపల్లి జిల్లా నోడల్ అధికారి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ దుగ్యాల ఆమయ్‌కుమార్, డీఎఫ్‌ఓ రవికిరణ్, పీవో చక్రధర్‌రావు, సింగరేణి జీఎం గురువయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి అనురాధ, సీపీవో కొంరయ్య, ఎల్‌డీ ఎం శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.