వరంగల్

వ్యాపారానికి వరంగల్ అనువైన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 24: వరంగల్ నగరం చారిత్రాత్మకంగానే కాకుండా ఎన్నో రకాల వ్యాపారాలకు, పెట్టుబడులకు అనువైన కేంద్రమైన వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను అధ్యయనం చేయడానికి చైనాలో పేరొందిన వివిధ కంపెనీల బృందం వరంగల్‌కు విచ్చేసింది. ముందుగా రాంపూర్ డంపింగ్ యార్డును పరిశీలించిన బృందానికి కూడా కార్యాలయంలో స్మార్ట్ సిటీ, ఇతర ప్రాజెక్టుల వివరాలను అధికారులు చైనా బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి వేగంగా వరంగల్ అభివృద్ధి చెందుతున్న నగరం అన్నారు. బిజినెస్‌కి సంబంధించి వివిధ పెట్టుబడులకు, కంపెనీలకు వరంగల్ బెస్ట్ ఆప్షన్ అని అన్నారు. హైద్రాబాద్ నుండి వరంగల్ వరకు ఉన్న రహదారిని ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి పర్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఇందుకు తగ్గట్టుగా చైనా కంపెనీ ప్రతినిధులు తమ వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చునని మేయర్ సూచించారు. వరంగల్ నగరాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి పరచాలన్న ఆలోచనకు చైనా కంపెనీ వారు తమ టెక్నాలజీనీ, ఐడియాలను జోడించి సరికొత్త అభివృద్ధి మార్గాలను తెలియ జేయాల్సిందిగా మేయర్ కోరారు. స్మార్ట్ సిటీలో భాగంగా వరంగల్‌లో వివిధ ప్రాంతాల్లో 5 ప్రధాన స్వాగత తోరణాల నిర్మాణాలను కట్టాలని నిర్ణయించుకున్నామని ఇందుకు కూడా చైనా తమ ఆలోచనలను జోడించి నిర్మించే బాధ్యత కూడా తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా టూరిజం హాబ్ కోసం చైనా బృందం తమ ఆలోచనలను,ప్రతిపాదనలు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి అనుమతులు తీసుకుంటామన్నారు. ఫర్నీచర్ ఇంటీరియర్ సెక్టార్‌లో చైనా ప్రాడక్ట్స్ బిజినెస్ పెట్టింది పేరు అయినందున ఈరకమైన వ్యాపారాలను నగరంలో ప్రవేశ పెట్టవలసిందిగా మేయర్ కోరారు. అనంతరం వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి వరంగల్‌లో జరుగుతున్న స్మార్ట్ సీటీ పనులను, కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులను, మానవ మల, మూత్ర వ్యర్ధాల శుద్ధీకరణ ప్లాంటు గురించి ప్రధాన నాలాల సుందరీకరణ, స్మార్ట్ రోడ్స్, సోలార్ ప్లాంట్ లాంటి తదితర అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చైనా కంపెనీల బృందానికి వివరించారు. పెట్టుబడులు పెట్టడానికైనా, అభివృద్ధి పనుల్లో తమ కంపెనీల ఒప్పందాలు పెట్టడానికైనా ఆసక్తి ఉంటే తప్పక సంప్రదించమని కలెక్టర్ తెలిపారు. అనంతరం కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ వరంగల్ నగరానికి ఈ రోజు ఒక శుభ దినమని అన్నారు. అభివృద్ధిలో చైనా వారి సహాయ సహకారాలను, సరికొత్త ఆలోచనలను స్వాగతిస్తున్నామన్నారు. మున్సిపల్ కమీషనర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరానికి చైనా నుండి టాప్ 20 కంపెనీలు అధ్యయనం చేయడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టెక్నాలజీ విషయంలో, బిజినెస్ పరంగా పూర్తి సహాయ సహాకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కంపినీల బృందానికి తెలియజేశామన్నారు. అభివృద్ధిలో మార్క్ కనపడాలంటే ఆలోచనలు, పద్దతులు, ప్రతిపాదనలు ఎంతో అవసరమని ఇందుకు గాను చైనా కంపెనీలతో కలసి పని చేసేందుకు చర్చలు జరిపామన్నారు. వారికి ఇక్కడి అభివృద్ధి పనులు బాగా నచ్చావని వరంగల్‌లో బిజినెస్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు మన్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈకార్యక్రమంలో చైనా బృందంతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.