క్రైమ్/లీగల్

-- ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఇసుక లారీ --

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, ఏప్రిల్ 6: అతి వేగంతో వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గారపాటి వీర్రాజు (41), చెట్టుపల్లి లవకుమార్ (25) అనే ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని వాడగూడెం వద్ద జరిగింది. ఇందుకు సంబంధించి మంగపేట పోలీసులు తెలిపిన ప్రకారం.. మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన రైతు సమన్వయ సమితి గ్రామ కమిటీ అధ్యక్షుడు గారపాటి వీర్రాజు, చెట్టుపల్లి లవకుమార్‌లు ద్విచక్ర వాహనంపై అకినేపల్లి మల్లారం నుండి మంగపేటకు వస్తున్నారు. ఏపి 36 టీబీ 3879 నెంబర్ గల లారీ కమలాపురం వైపు నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ.కొత్తగూడెం వద్ద ఉన్న వీరాపురం ఇసుక క్వారీకి ఇసుక లోడ్ కోసం వెళ్తోంది. ఈ క్రమంలో మండలంలోని వాడగూడెం మూలమలుపు వద్ద అతివేగంగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గారపాటి వీర్రాజు, చెట్టుపల్లి లవకుమార్‌లకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం తెలుసుకున్న మంగపేట పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతి చెందిన గారపాటి వీర్రాజు సోదరుడు గారపాటి బాపిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించినట్లు మంగపేట పోలీస్ కానిస్టేబుల్స్ కె.రమేష్, యం.రమేష్‌లు తెలిపారు.

రాజుపేటలో ధర్నా..
ఇసుక లారీలను, వాటి వేగాన్ని నియంత్రించాలని మండలంలోని రాజుపేటలో శుక్రవారం ధర్నా, రాస్తారాకో కార్యక్రమం నిర్వహించారు. ఇసుక లారీ ఢీకొనడంతో మండలంలోని అకినేపల్లి మల్లారంకు చెందిన గారపాటి వీర్రాజు, చెట్టుపల్లి లవకుమార్‌లు శుక్రవారం మృతి చెందడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అకినేపల్లి మల్లారం, రాజుపేట, కత్తిగూడెం, వాడగూడెం, పాలాయిగూడెం తదితర 6గామాల ప్రజలు శుక్రవారం రాజుపేటలో ధర్నా, రాస్తారాకో కార్యక్రమం నిర్వహించారు.