వరంగల్

మాస్టర్ ప్లాన్ ముసాయదా మరింత జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 19: మాస్టర్ ప్లాన్ ముసాయిదా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్‌తో పాటు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఏం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు, అర్బన్, రూరల్ కలెక్టర్లతో రెండుసార్లు సమావేశం జరిగింది. ఈ మేరకు గురువారం కూడా కార్యాలయంలో కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి అధ్యక్షతన బోర్డు మీటింగ్ జరిగింది. మాస్టర్ ప్లాన్‌పై ప్రాధమిక సమీక్షలో సమావేశం చర్చించింది. మాస్టర్ ప్లాన్ బృహత్తర ముసాయిదాను సాంకేతిక నిపుణుల బృందానికి చట్ట బద్దంగా ఉంచవలసి ఉన్నందున ఒక వారంలోపు పూర్తి చేసి ముసాయిదాను ప్రకటించాలని సమావేశం నిర్ణయించింది. ఇది కాకుండా కూడా ఆర్ధిక వనరులు పెంపొందించడానికి మూడు ప్రాంతాలలో పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేయాలని కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి ప్రతిపాదించారు. అదే విధంగా కూడా పరిధిలో ఉన్న స్టోన్ క్రషర్స్, రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటుకు కుడా నుండి ఎన్‌ఓసి తప్పనిసరి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చైర్మన్ మర్రి యాదవరెడ్డి ప్రతిపాదించారు. దీనిపై త్వరలోనే మైనింగ్ శాఖతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని సమావేశం ప్రకటించింది. అంతే కాకుండా ఈ సమావేశంలో ప్రధానంగా తొమ్మిది ఎజెండా అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అందులో నాలుగు అంశాలు భూ మార్పిడికి చెందిన ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి సంబందించి పురుపాలక శాఖ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే 2000 భూ మార్పిడి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. అదే విధంగా ఉర్సు గ్రామంలో ధాత్రి హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారిచే నిర్మిస్తున్న ఆసుపత్రి భవన నిర్మాణం గురించి శరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని సమావేశం తీర్మానించింది. అదే విధంగా హన్మకొండలోని విజయ ధియెటర్ వద్ద రెసిడెన్సియల్ జోన్‌లో ఫంక్షన్ హాల్ అనుమతికి సంబందించి డిజి ఫైర్ సర్విసెస్ నుండి ఎన్‌వోసి వచ్చిన తర్వాత బోర్డు పునుర్‌పరిశీలన చేయాలని నిర్ణయించింది. సమావేశంలో కూడా వైస్ చైర్మన్ వీపీ గౌతమ్, డిటీసీపీ విద్యాదర్, కూడా ప్రణాళిక అధికారి అజిత్ రెడ్డి, సెక్రటరీ మురళీదర్‌రావు పాల్గొన్నారు.