వరంగల్

పంట పెట్టుబడి చెక్కులను వెంటనే అందజేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంట పెట్టుబడి చెక్కులను వెంటనే అందజేయాలి
నక్కలగుట్ట, ఏప్రిల్ 23: ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడికి ఇచ్చే చెక్కులను వెంటనే నగదు రూపేణా చెల్లించాలని, సకాలంలో రైతులకు నగదు చెల్లించనిచో కఠిన చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులను రూరల్ జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో పంట పెట్టుబడి చెక్కుల పంపిణీపై బ్యాంకు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పంట పెట్టుబడి మద్దతు పథకం కోసం మొదటి దఫా ఆరు వేల కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని, ఇట్టి నగదును బ్యాంకర్లు ఎట్టి పరిస్థితులోనూ ఇతర అవసరాలకు సర్దుబాటు చేయకుండా రైతులకు చెల్లించాలని తెలిపారు. రైతులు వారికి నిర్దేశించిన బ్యాంకులకు చెక్కుతోపాటు, పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డును తప్పక వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జెడి ఉషాదయాళ్, ఆర్డీఓలు మహేందర్‌జీ, రవి, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

మెరుగైన సేవలు అందించాలి
* వైద్యాధికారులకు అర్బన్ కలెక్టర్ ఆదేశం
వడ్డేపల్లి, ఏప్రిల్ 23: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను ఉర్సు కరీమాబాద్ ప్రసూతి ఆసుపత్రిలో మే 10వ తేదీ నుండి మాతాశిశు సంక్షేమ సేవలను అందించాలని వైద్యాధికారులను అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి ఆదేశించారు. సోమవారం ఉర్సు ఆసుపత్రిలో మాతాశిశు సంక్షేమ వైద్య సేవలపై వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ సికెఎం ఆసుపత్రిలో గర్భిణీ స్ర్తిల ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఎంజిఎం మాతాశిశు సంక్షేమ కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులను ఉర్సు ఆసుపత్రిలో సేవలు అందించాలని ఎంజిఎం పర్యవేక్షకులను కోరగా, దానికి ఆయన వెంటనే అంగీకరించి సేవలు అందించడానికి తమ సిబ్బందిని పంపిస్తానని తెలిపారు. అదే విధంగా ఆపరేషన్లు నిర్వహించే సమయాలలో సికెఎం, పట్టణ ఆరోగ్య కేంద్రాల నుండి వైద్యులు, కావలసిన సిబ్బందిని పంపించి, సేవలను అందించాలని అధికారులను కోరారు.