వరంగల్

జిహెచ్‌ఎంసితో పాటే వరంగల్ ఎన్నికలు జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 2: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఒక పథకం ప్రకారమే ముఖ్యమంత్రి కెసిఆర్ జిహెచ్‌ఎంసి ఎన్నికలను నిర్వహిస్తూ వరంగల్, ఖమ్మం తదితర ఎన్నికలను వాయిదా వేసి లబ్ధిపొందాలని కుట్రపన్నుతున్నారన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మంత్రులందరినీ అక్కడే మోహరింపజేసి అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలతో పాటే వరంగల్, ఖమ్మం, మిగతా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా నిర్వహించాలన్నారు. శనివారం వరంగల్ డిసిసి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మొదట్లో ముఖ్యమంత్రి కెసిఆర్ కంతనపల్లి ప్రాజెక్టు పనులపై హడావుడి చేసి పనులు ప్రారంభించి అర్ధంతరంగా ఎందుకు పనులను రద్దు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కంతనపల్లి ప్రాజెక్టు పనులను రద్దు చేశారని ఆయన ఆరోపించారు. కంతనపల్లి ప్రాజెక్టు పనులు పూర్తయినట్లయితే అక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణమయ్యేదని ఆయన అన్నారు. ఎన్నికల ముందు టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మూడు నెలల్లోనే వరంగల్‌లో అండర్ డ్రైనేజీ నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఏడాదిన్నర గడిచినా ఇంతవరకు దాని ఊసేలేదన్నారు. గత ఏడాది వరంగల్ పర్యటన సందర్భంగా సిఎం కెసిఆర్ టెక్స్‌టైల్ పార్కు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై హడావుడి చేసి ఏడాది గడిచినా ఆవగింజంత పనులు కూడా ముందుకు పోలేదన్నారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్‌షెడ్ నిర్మాణం ఎందుకు వెనక్కిపోయిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కేవలం మాటలతో ప్రజల కడుపునింపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆచరణలో ఏది కూడా అమలు చేయడం లేదన్నారు. వరంగల్ జిల్లా దినదినం అభివృద్ధి చెందుతుందని, మెట్రోరైల్ ప్రాజెక్టు కూడా ఇక్కడ ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంపై సిఎం ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి ఆనాడు టిడిపి శంకుస్థాపన చేసి మరచిపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తాము దేవాదుల పనులను చేపట్టామన్నారు. తమ హయాంలోనే భువనగిరి నుండి వరంగల్‌కు ఫోర్‌వే లైన్ మంజూరైందని, అదే విధంగా గోదావరి నదిపై నిర్మించిన ముళ్లకట్ట బ్రిడ్జి కూడా తమ హయాంలోనే రూపాంతరం చెందిందన్నారు. అప్పటి ప్రత్యేక పరిస్థితుల వల్ల తాము వాటిని ప్రారంభోత్సవం చేయలేకపోయామని, వాటినే ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. జిల్లాలో సంచలనం రేకెత్తించిన గిరిజన బాలికల మృతిపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను వేసిన ఈ ప్రశ్నలన్నింటికీ స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆరే స్పందించాలని, లేదా వరంగల్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వీటిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు తాటిశెట్టి విద్యాసాగర్, డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఇ.వి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గ్రేటర్ ఎన్నికలకు సన్నద్ధంకండి

వరంగల్, జనవరి 2: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శనివారం సాయంత్రం టిఆర్‌ఎస్ అర్బన్‌పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల డివిజన్‌ల రిజర్వేషన్లపై నాయకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు రిజర్వేషన్లను ప్రభుత్వానికే పంపారేతప్ప ఇంకా ఖరారు కాలేదన్నారు. అందులో ఏమైనా మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని వీటి విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా తన దృష్టికి తీసుకరావాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్పొరేషన్‌పై ఎగిరేది గులాబీ జెండేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేటర్లుగా టికెట్‌లు ఆశించడం సహజమే అయినప్పటికి అనివార్యకారణాల వల్ల అందరికీ టికెట్లు దక్కవని, అయినప్పటికి సమష్టి కృషితో కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగిరేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. నెల 4న మడికొండ వద్ద వరంగల్ ఫోర్‌వే రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వస్తున్నందున అక్కడ జరిగే బహిరంగసభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని కార్యకర్తలను కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. త్వరలోనే పశ్చిమ నియోజకవర్గంలో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు జరుగుతాయన్నారు. ఆ దిశగా ఇప్పటికే అధికారులు అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ విలేఖరుల సమావేశంలో గ్రేటర్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్, నాయకులు నార్లగిరి రమేష్, మర్రి యాదవరెడ్డి, గైనేని రాజన్ తదితరులు పాల్గొన్నారు.