వరంగల్

జూన్ 30నాటికి అన్ని ఆవాసాలకు నీరందించాలి: కలెక్టర్ శివలింగయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మే 19: జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా అన్ని ఆవాసాలకు నీరందించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారుల ను ఆదేశించారు. శనివారం జిల్లాలో మిషన్ భగీరథ బల్క్ సప్లై పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1225 హబిటేషన్లకు గాను 452హిబిటేషన్లు బల్క్ నీటి సప్లై చేయడం జరిగిందని మిగిలిన 773 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా బల్క్ సప్లై కొర కు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. డోర్నకల్ నియోజకవర్గంలో 498 ఆవాసాల్లో 347 ఆవాసాలకు పూర్తి అయ్యాయని మహబూబాబాద్ నియోజకవర్గంలోని 82 ఆవాసాలకు ఇంకనూ బల్క్‌సప్లై పనులు ఒక్కటి కూడా పూర్తికాలేదని వాటిపై ప్రత్యేక దృష్టిసారించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పనులు చేపట్టాలని ఆదేశించా రు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో 95 ఆవాసాలకు 53 ఆవాసాలకు బల్క్‌నీరు సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సమీక్షలో సురేందర్, ఎస్‌ఈలు, ఈఈలు తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌సెల్ రద్దు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవా రం జరిగే గ్రీవెన్స్‌సెల్ 21వ తేదీన రద్దుచేసినట్లు జిల్లా కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. తీవ్ర ఎండలు, వడ గాలులను దృష్టిలో ఉంచుకొని 21వ తేదీ జరిగే గ్రీవెన్స్‌సెల్‌ను రద్దుచేసినట్లు తెలిపారు.

రైతుబంధుతో ఎన్నికల జిమ్మిక్కు
* కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి
నర్సంపేట, మే 19: కేసీఆర్ ప్రభు త్వం రైతులు పండించిన పంటకు మద్దతు ధర పెంచకుండా రైతు బంధు పథకం పేరుతో ఎకరాకు రూ. 4 వేలు ఇవ్వడం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటమేనని అఖిలభారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నా రు. నర్సంపేటలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కన్నా వారి ఓట్లపైనే ఎక్కువ ప్రేమ కనబరుస్తుందని, ఈ క్రమంలో మద్దతు ధర గురంచి మాట్లాడకుండా పెట్టుబ డి సహాయం అంటూ ఊరిస్తూ రైతు ల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే గోప్ప పథకమని ప్రచార ఆర్భాటం చేస్తున్న అధికార పార్టీ నాయకులకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా కలిపి ఇస్తూ ఎకరాకు 12వేల వరకు లాభం చేకూరుస్తున్న కేరళ లాంటి రాష్ట్రాలు కనపడటం లేదా అని ప్రశ్నించారు. అకాల వర్షాలతో పంటలు కోల్పోయి న రైతులకు ఎకరాకు 20వేలు ఇస్తామని, తడిసిన మక్కలను, వరి ధాన్యా న్ని కొనుగోలు చేస్తామని నెలల గడుస్తున్నా అమలుకు నోచుకోకపోవడం ప్రభుత్వ చిత్తశుద్దికి అద్దం పడుతుందన్నారు. పదిహేను లక్షల మంది కౌలు రైతులకు, రెండు లక్షల మంది పోడు రైతులకు రైతుబంధు వర్తింపజేయకపోవడం సరి కాదన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి చుక్క య్య, నాయకులు పెద్దారపు రమేష్, నమిండ్ల స్వామి, వంగాల రాగసుధ, కందికట్ల వీరేష్, సదానందం, మల్లేష్, యాకయ్య, అఖిల్, రాజేష్, బాబా తదితరులు పాల్గొన్నారు.

రైతుబంధు అంతా తప్పుల తడకే
* తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు యాదగిరి
గంగారం, మే 19: గంగారం మండలంలో రైతుబంధు అంతా తప్పుల తడగకాగనే ఉందని ఎహెచ్‌పీఎస్ తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు బూర్క యాదగిరి విమర్శించారు. గంగారం మండలకేంద్రంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. భూమి ఎక్కువ ఉన్నవారికి రికార్డులో తక్కువగా రాశారని అస లు భూమిలేని వారు సైతం ముడుపులు తీసుకొని భూమి ఉన్నట్టు పాస్‌పుస్తకా లు తయారుచేసి చెక్కులు ఇచ్చారని ఆరోపించారు. పాస్‌పుస్తకాలు చాలా తప్పులతడకగా ఉన్నాయని.. కొన్ని అసలు భూములకు వారిచ్చిన పట్టాపాస్ పుస్తకాలకు పొంతనే లేదన్నారు. మండలంలోని బూర్కవారి గుంపులో ఎంతోమందికి ఎంతోకొంత భూమి ఉన్నా అసలు చాలా మందికి సర్వేచేసి పాస్‌పుస్తకాలు, చెక్కులు ఇవ్వలేదని విమర్శించారు. భూ ప్రక్షాళన పేరుతో టీఆర్‌ఎస్ సర్కార్ రైతులకు మేలు చేయడం అటుంచి కనీసం భూమి ఉన్న వారికి సరిగా పట్టాలు, చెక్కులు ఇవ్వలేదని ఇదంతా బడా భూస్వాముల ప్రయోజనం కోసం జరిగిన జిమిక్కే అన్నారు. ఇప్పటికైనా మండలం అంతా రీసర్వే చేయించి కచ్చితంగా భూమి ఉన్నవారికి పాస్‌బుక్‌లు, చెక్కులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకలు వెంకటరత్నం, ఈసం నాగేశ్వర్‌రావు, ఎదళ్లపల్లి శంకర్, కల్తీ రామయ్య తదితరులు పాల్గొన్నారు.