వరంగల్

రంజాన్ మాసం ప్రశాంతంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మే 22: పవిత్ర రంజాన్ మాసంను ముస్లింలు ప్రశాంతంగా నిర్వహించుకు నే విధంగా తగు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. మంగళావారం కలెక్టరేట్ సమవేశ మందిరంలో జేసీ దామోదర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ గిరిధర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రంజాన్‌ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహబూబాబా ద్ జిల్లాలోని ముస్లింలకు 2500గిఫ్ట్‌ప్యాక్‌లతోపాటు ఇఫ్తార్ విందుకు రూ.5లక్షలు కేటాయించిందని తెలిపారు. ఇందులో మహబూబాబాద్ నియోజకవర్గాని కి రూ.3లక్షలతోపాటు 1500గిఫ్ట్‌ప్యాక్‌లు, డోర్నకల్ నియోజకవర్గానికి రూ.2లక్షలతోపాటు 1000గిఫ్ట్‌ప్యాక్‌లు కేటాయించడం జరిగిందని అన్నారు. మసీదు కమిటీల నిరుపేదల వివరాలు జూన్ 5 లోగా జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారికి సమర్పించాలని తెలిపారు. ప్యాక్‌లు పంపిణీ దావతే ఇఫ్తార్ ఏర్పాటు తేదీలు త్వరలో ప్రకటించనున్నట్లు చెప్పారు. జిల్లాలో 45 మసీదులకు గత సంవత్సరం మరమ్మతులకు రూ.8.38లక్షలు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మసీదులకు మరామత్తులలో ఈద్గాలకు ప్రహరిగోడలను నిర్మాణం చేయాలని ఇమామ్ వౌజమ్‌లకు ప్రభుత్వ గౌరవ వేతనం రావడంలేదని కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకరాగా వక్స్‌బోర్డు, ఇన్ప్‌క్టర్ లేనిచోట జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విధులు నిర్వర్తించాలని చెప్పారు. ఈ సమావేశంలో డిఆర్‌డివో రాంబాబు, డియంహెచ్‌వో శ్రీనివాసరావు, ఆర్డివో కృష్ణవేణి, మున్సిపల్ కమీషనర్ ఇంద్రసేనారెడ్డి, కౌన్సిలర్ ఫరీద్, ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు.