వరంగల్

కాకతీయ కాలం నాటి కట్టడాలను పరిరక్షిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 22: జిల్లాలోని కాకతీయ కాలం నాటి కట్టడాలను పరిరక్షించడంతో పాటు పర్యాటకులను అకట్టుకునేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అన్నారు. మంగళవారం కలెక్టర్ కాన్ఫరెన్స్‌హాల్‌లో పర్యాటక, పురావస్తుశాఖ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లో సీనివారం రూ.26కోట్లతో ఏర్పాటు చేయుటకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా యువ దర్శకులను ప్రొత్సహించడం జరుగుతుందని, షార్ట్ ఫిలిమ్స్, పురాతన సినిమాల ఎంపిక చేసి ప్రదర్శించడం జరుగుతుందని ఆమె తెలిపారు. వరంగల్ పోచమ్మ మైదాన్‌లోని మల్టిపర్పస్ కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు పునప్రారంభించడానికి చర్యలు చేపట్టడంతో పాటు కాకతీయ కాలం నాటి కొత్తవాడ లోని మెట్ల బావి పునరుద్దరణ, శివనగర్‌లోని మెట్టుబావి, ధర్మసాగర్‌మండలంలోని ముప్పినాధ స్వామి దేవాలయం, మనిపల్లి శివాలయ దేవాలయం అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ కోరారు. అదే విధంగా ఆహ్లాద వాతావరణంలో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా పలు శాఖల సమన్వయం తో ధర్మసాగర్ చెరువు వద్ద ఇనుపరాతి గుట్టలనందు నైటి క్యాంపింగ్ వీకేండ్‌షో, యాంత్రిక జీవితానికి దూరంగా ఉండేదుందుకు గాను జూన్ 5న ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. రాష్ట్ర పురావస్తు శాఖ ఇటీవల సేకరించిన కాకతీయ కాలం నాటి పురావస్తు శిల్పాలు సేకరించి మ్యుజియంలో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. భద్రకాళి దేవస్థానం పరిధిలోని భూముల పరిరక్షణ, వరంగల్ ఖిలాను పర్యాటకులను అకట్టుకునే విధంగా మరింత అభివృద్ధి చేయడం కోసం చర్యలతో పాటు సౌండ్, లైటింగ్ సిస్టం పునప్రారంభించుటకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సునీత, పురావస్తు శాఖ అధికారి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఐ నిరసన
* సీపీఐ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం * సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి
మహబూబాబాద్, మే 22: కేంద్రప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి డిమాండ్ చేశారు. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసన గా తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి మాట్లాడుతూ.. 2008సంవత్సరంలో క్రుడాయిల్ ధర బ్యారల్‌కు అత్యధికంగా 147డాటర్లు ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్‌కు రూ.54 యుపీఏ గవర్నమెంట్‌లో ఉంటే నేడు క్రుడాయిల్‌ధర బ్యారల్‌కు 78డాటర్లు మాత్ర మే ఉంది. అలాంటప్పుడు లీటర్ పెట్రోల్‌కు రూ.84 ఎలా ఉంటుందో ఇందులో మతలాబు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. నాటికి, నేటికి పోల్చి తే బీజేపీ ప్రభుత్వం ప్రజలపై అదనంగా రూ.30 ఎందుకు పెంచిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 2012లో మోదీ గుజరాత్‌లో సీఎంగా ఉన్నప్పుడు పెట్రోల్‌ధరల పెంపు వల్ల గుజరాత్‌పై భారం పడుతుందని అన్న మోదీ నేడు దేశ ప్రజలపై ఈ భారం మోపడం ఏంటని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి పెరుగు కుమా ర్, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకన్న, సాంబలక్ష్మి, పట్టణ సహాయ కార్యదర్శి రేషపల్లి నవీన్, నాయకులు నర్రా శ్రావణ్, యాకాంబ్రం, రమేష్, కిష్టయ్య, శంకర్, శ్రీను, కిషోర్, శ్యాం, విజయ్, శ్రీకాంత్, సన్ని, రమేష్, అనిల్, శోభ, సోమయ్య, వివేకసాయి తదితరులు పాల్గొన్నారు.