వరంగల్

సజావుగా రైతుబంధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 22: వరంగల్ అర్బన్ జిల్లాలో రైతుబంధు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ సజావుగా పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ అమ్రపాలి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 60 శాతం పంపిణీ చేయడం జరిగిందని ఆమె వెల్లడించారు. మంగళవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన రైతుబంధు పథకంలో చెక్కుల పంపిణీ, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 10 నుండి 18వరకు గ్రామ సభల ద్వారా పంపిణీ కార్యక్రమాలు చేయడం జరిగిందని, గ్రామ సభల ద్వారా పంపిణీ కాకుండా మిగిలిన వాటిని తహశీల్ధార్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందించడం జరుగుతుందని ఆమె వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 119 గ్రామాలలో 78,228 మంది పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేయాల్సి ఉండగా 42,155 మంది రైతులకు పంపిణీ చేశామని, టైటిల్ వెరిఫికేషన్, కోర్టు తగాదాలు, ఇతర కారణాల చేత 2,118 పెండింగ్‌లో ఉంచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా రూ.69 కోట్ల 41 లక్షల 44వేల 520 రూపాయాలు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.46 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పాసుపుస్తకాల పంపిణీకిగాని, చెక్కుల పంపిణీకిగాని ఎటువంటి ఆధారాలు చూపిన రైతులకు నేరుగా రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయాలని, ఎటువంటి విభేదాలకు తావు ఇవ్వకుండా చూడాలని, పంపిణీ ఆనంతరం ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన సంబధిత అధికారుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. రానున్న రోజులలో పూర్తి స్థాయి చెక్కుల పంపిణీ, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ పూర్తి చేయడం జరగాలని ఆమె అధికారులను ఆదేశించారు. మండలలా వారిగా ధర్మసాగర్ మండలంలో పట్టాదారు పాసుపుస్తకాలు 8,618కిగాను 8,417 పంపిణీ చేయడం జరిగిందని, కిలోవరంగల్ మండలంలో 3,517కుగాను 3,007 పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కమలాపూర్ మండలంలో 9,377కుగాను 8,473, హన్మకొండ 1,236కుగాను 1,090, ఐనవోలు మండలంలో 8,443కుగాను 6,324, ఎల్కతూర్తి మండలంలో 7,750కిగాను 6,853, కాజీపేట మండలంలో 4,675కుగాను 3,900 పంపిణీ చేయడం జరిగిందని ఆమె వివరించారు. వరంగల్ మండలం 1,469కిగాను 1,207 పంపిణీ చేయడం జరిగిందని, భీమదేవరపల్లి మండలం 6,982కుగాను 5,120, వేలురు 5,645కు గాను 5,091 పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. రైతుబంధు పథకం ద్వారా వేలురులో 6,013 చెక్కులకు గాను 5,095, వరంగల్‌లో 1,569 చెక్కులకు గాను 1,208 చెక్కులు, హసన్‌పర్తిలో 11,520 చెక్కులకు గాను 7,879, ఎల్కతూర్తిలో 7,950 చెక్కులకుగాను 6,616, కాజీపేటలో 4,366 చెక్కులకు గాను 3,301, భీమదేవరపల్లి 10,676 చెక్కులకు గాను 8,645, ధర్మసాగర్‌లో 9,314చెక్కులను గాను 8,020, కిలోవరంగల్‌లో 3,772కుగాను 3,007 చెక్కులను, కమలాపూర్‌లో 12,073 చెక్కులకుగాను 6,830, ఐనవోలులో 10,062 చెక్కులకు గాను 6,936 చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ దయానంద్, వ్యవసాయ అధికారి ఉషాదాయల్, ఆర్డీవో వెంకారెడ్డి, తహశీల్ధార్లు , వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.