వరంగల్

ఒక్క పైసా రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, మే 22: మక్కలు అమ్మి నెల రోజులైన ఒక్క పైసా రాకపోవడంతో రైతులు మక్కల డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. సకాలంలో అందని మక్కల డబ్బులతో అన్నదాతను దిగాలు పరుస్తోంది. మద్దతు ధర ఆశతో విక్రయించిన ధాన్యం పైసలు ఖాతాను చేరకపోవడంతో రైతులు కంగుతింటున్నారు. 48 గంటల్లోనే అన్‌లైన్ ద్వారా డబ్బుల ప్రకట న ప్రకటనకే పరిమితమైందనే వ్యాఖ్యలు రైతు సం ఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులైన నగదు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. కొనుగోలు మొదలు డబ్బుల్ని అందించే విషయంలో జరుగుతున్న జాప్యం రైతుల్ని నీరసించేలా చేస్తోంది. ఇన్నాళ్లు పండించిన పంటను అమ్ముకునే దగ్గర అష్టకష్టాల్ని పడిన ఆగచాట్లను మరవకముందే మరోమారు మక్కల డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రైతన్నకు ఎదరవుతుంది.
పరకాల వ్యవసాయ మార్కెట్‌లో మక్కలు విక్రయించిన సుమారు వెయ్యి మందికి రూ. 6కోట్ల బకా యి రైతులకు మార్కెఫెడ్ చెల్లించాల్సి ఉంది. పరకాల వ్యవసాయ మార్కెట్‌లో మక్కలు విక్రయించిన రైతులకు నెల రోజులైన అన్నదాత ఖాతాల్లోకి మక్కల డబ్బులు చేరలేదు. పరకాల వ్యవసాయ మార్కెట్‌లో పరకాల పీఎసీఎస్ ఆధ్వర్యంలో మార్కెఫెడ్ సహకారంతో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. పరకాల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని రైతులు మక్కలను తీసుక వచ్చి పరకాల పీఎసీఎస్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. మొత్తం సుమారు రూ. 6కోట్లకు పైగా లావాదేవిలు చేపట్టారు. సుమారు నెల రోజులు దాటిన ఒక్క పైసా జమ కాకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. అయితే కాంటా అయిన వెంటనే అన్‌లైన్‌లో వివరాల్ని పూర్తి స్థాయిలో పొందుపరుస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అటు మార్కెట్ కమిటీలతో పాటు కొనుగోలు కేంద్రాలకు, బ్యాంకుల వద్దకు వెళ్తూ నగదు జమ విషయమై రైతులు ఆరా తీస్తు మక్కల డబ్బుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
* 90వేల మక్కల బస్తాల కొనుగోలు...
పరకాల వ్యవసాయ మార్కెట్‌లో పరకాల పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రం ద్వారా సుమారు 90 వేల మక్కల బస్తాలు కొనుగోలు చేసినట్లు పరకాల పీఎసీఎస్ చైర్మన్ కట్కూరి దేవేందర్‌రెడ్డి తెలిపా రు. 90 వేల బస్తాలు అనగా సుమారు 45 వేల క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే మక్కలు విక్రయించిన రైతులకు డబ్బులు జమ కాకపోవడంతో దిగాలు చెందుతున్నారు. ఇప్పటికే ఆకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. కోరుకున్న సమయంలో చేతికి అందివచ్చిన పంటను అమ్ముకోకుండా ఇబ్బందులకు గురి చేసింది. దీంతో ఒక్కో రైతు రేయింబళ్లు పడిగాపులు కాశారు. అష్టకష్టాలు పడి పంటను మద్దతు ధరకు అమ్ముకునే ధ్యాసను చూపించారు. ఇంత జరిగినా చివరకు చేతికి పైసలు సజావుగా అందడం లేదనే అపవాదును ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇప్పటికైనా అన్నదాతకు డబ్బులు జమ విషయంలో ఎమ్మెల్యే, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

పల్లికాయకు పడని టెండర్లు
* కొనేందుకు ముందుకు రాని ట్రేడర్లు * మార్కెట్ ఉండెందుకని రైతుల ఆవేదన
కేసముద్రం, మే 22: కేసముద్రం మార్కెట్‌కు మంగళవారం వివిధ గ్రామాల నుండి దాదాపు 25 బస్తాల పల్లికాయ విక్రయానికి రాగా ‘ఈనామ్’లో వ్యాపారులెవరూ టెండర్లు వేయలేదు. దీనితో మధ్యాహ్నం 1 గంటకు విన్నర్ లీస్ట్ వెళువడిన అనంతరం పల్లికాయను వ్యాపారులెవరూ కొనేందుకు అంగీకరించలేదన్న విషయం తెలుసుకున్న రైతులు మార్కెట్ కార్యాలయానికి వచ్చి పల్లికాయ అమ్మించాలని వేడుకున్నారు. అయితే ఎరగాలు పంటగా పల్లికాయ సాగు చేయడం వల్ల నాసిరకంగా ఉందని, తాము అలాంటి సరుకు ఖరీదు చేయలేమని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారని, తామేమీ చేయలేమని మార్కెట్ సిబ్బంది చేతులెత్తేశారు. అయితే తాము నాసిరకంగా తయారు చేశామా.. పంటపండింది అలా.. ఎంతకోకొంతకు కొనడానికి టెండర్ వేస్తే ఇష్టముంటే అమ్మేటోళ్లం.. లేకుంటే ఊకుండటోళ్లం.. అసలు టెండర్లు ఎందుకు వేయలేదని జయపురం గ్రామానికి చెందిన నర్సయ్య ప్రశ్నించాడు. పల్లీలు కిలోకు కిరాణదుకాణంలో 100 రూపాయలు తీసుకుంటాండ్లు.. ఆ లెక్కన కనీసం క్వింటాలుకు 5వేల ధర పెట్టాలే.. అది కూడా లేదు.. కనీసం 3 వేలైనా ఇస్తరనుకున్నా.. కొనడానికే రాకపాయే అంటూ నాగారం గ్రామానికి చెందిన మహేష్ వాపోయాడు. ఖాదర్‌పేట, నాగారం, జయపురం గ్రామాలకు చెందిన రైతులు పల్లికాయతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ట్రాక్టర్లలో తీసుకురాగా పల్లికాయ కొనేందుకు వ్యాపారులు ముందుకురాకపోవడంతో తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. ఇందులో తులసీరాం మాత్రం సాయంత్రం వరకు పల్లికాయ ఎవరికైనా అమ్మిపెట్టాలంటూ మార్కెట్ కార్యాలయం వద్ద పడిగాపులు పడ్డాడు. పల్లికాయ రాశి వద్ద తన వదినను ఉంచి కనిపించిన ప్రతి ఒక్కరికి తన గోడు వెళ్లబోసుకున్నాడు. మార్కెట్లో నాసిరకంగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులకు ఆదే తీరులో ధర పెట్టి ఖరీదు చేయాల్సి ఉన్నా.. వ్యాపారుల్లో ఒక్కరు కూడా పల్లికాయకు టెండర్లు వేయకపోవడం విడ్డూరంగా మారింది.