వరంగల్

నేటి నుండి టీఎస్ ఐసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 22: రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలో సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఐసెట్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 23,24 తేదీలలో ఆన్ లైన్ పద్దతిలో నిర్వహించనున్నారు. వరంగల్ జిల్లాలో జరిగే టీఎస్ ఐసెట్ 2018 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సారి ఆన్‌లైన్ పద్దతిలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాలలో 61,439 మంది అభ్యర్ధులు పరీక్షలకు ధరఖాస్తు చేసుకున్నారు. పకడ్బందిగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమిషం నింబందన కూడా అమలులో ఉటుంది. మూడు షిప్టులలో ఐసెట్ పరీక్షలు జరుగనున్నాయి. 23 ఉదయం 10గంటల నుండి మద్యాహ్నం 12.30 గంట ల వరకు ఉదయం సెషన్, మద్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు రెండవ సెషన్ ఉంటుంది. అదే విధంగా 24న ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 12.30 గంటల వరకు మూడవ సెషన్ పరీక్షలు జరుగుతాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కర్నూల్, మహబూబ్‌నగర్, నర్సపూర్, నిజమాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలకు ఆరగంట ముందే అభ్యర్ధులను అనుమతిస్తారు. టీఎస్ ఐసెట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8కేంద్రలో జరిగే పరిక్షకు 6400 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు.

మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం
* నిర్లక్ష్యంచేస్తే సహించేది లేదు : జనగామ కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి ఆదేశం
రఘునాథపల్లి/నర్మెట, మే 22: మరుగుదొడ్ల నిర్మాణాలను జిల్లాలో వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం రఘునాథపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణాలపై జరిగిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయడంలో అధికారులు, ప్రజాప్రతినిథు లు నిర్లక్ష్యం వహించవద్దని ఆయన అన్నారు. మండలంలో ఇంకా అసంపూర్తి దశలో ఉన్న మరుగుదొడ్లను జూన్ 2న నిర్మించుకునే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పూర్తిచేసిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిథులపై ఉందన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లను నిర్మించుకోని వారికి గ్రామసర్పంచ్, స్వచ్ఛంద సంస్థలు వారికి కౌన్సిలింగ్ నిర్వహించి మరుగుదొడ్లు నిర్మించుకునేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బానోతు శారద, డీపీవో రవికుమార్, తహశీల్దార్ ఎల్. రవిచంద్రారెడ్డి, బీసీ ఐడీ ఝాన్సీరాణీ, సెట్వార్ ఈడీ గోపాల్‌రావు, ఏపీడీ సంపత్, ఈవోపీఆర్‌డీ గంగాభవాని, వ్యవసాయ అధికారి పాల్గొన్నారు.
వారం రోజుల్లో మరుగుదొడ్లు పూర్తిచేయాలి: నర్మెట మండలంలో పెండింగ్‌లో ఉన్న 1560మరుగుదొడ్లను వారం రోజుల్లో పూర్తిచేసుకోవాలని కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం నర్మెట మండల కేంద్రలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఎంపీపీ భూక్య పద్మ అధ్యక్షత వహించగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్మెట మండలంలో పెండింగ్‌లో ఉన్న 1560 మరుగుదొడ్లను వారం రోజుల్లో పూర్తిచేయాలన్నారు. దీనికి సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్‌లో తమ బాధ్యతగా గుర్తించాలన్నారు. లేనిచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, డీడబ్ల్యువో పద్మజారమణ, ఏపీడీవో సంపత్‌రావు, ఏపీడీ వసంత, ఎంపీడీవో ప్రసాద్, తహశీల్దార్‌లు తదితరులు పాల్గొన్నారు.

నిజాం చెరువును పరిశీలించిన జేసీ
మహబూబాబాద్, మే 22: మహబూబాబాద్ పట్టణంలోని నిజాం చెరువు నీటి పరివాహక ప్రాంతం హద్దులు నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా జాయింట్ కలెక్టర్ కె.దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు హద్దులు పరిశీలించి ఇంకా పూర్తిస్థాయిలో హద్దులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించా రు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. గతంలో నీటి పరిహక ప్రాంతంపైన హైకోర్టులో వచ్చిన జడ్జ్‌మెంట్ పూర్వాపరాలను పరిశీలించి న్యాయస్థానం ఆదేశాలకు లోబడి తగు నిర్ణయాలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం చెరువు కింద ఆయకట్టు లేనందున అట్టి చెరువును మున్సిపల్ పరిధిలోకి తీసుకరావడానికి తగిన ఆదేశాల కోసం కలెక్టర్‌కు నివేదించనున్నట్లు జెసి తెలిపారు. చెరువు సుందరీకరణ కోసం గతంలోనే డిపిఆర్ తయారుచేయించి ఇరిగేషన్‌శాఖ ద్వారా ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కాగానే కలెక్టర్ సూచనల మేరకు సంబందిత శాఖ అధికారులు తగు అభివృద్ధి పనులు చేపడుతారని అన్నారు. చెరువులోకి మురికినీరు, వ్యర్ధ పదార్ధాలు రాకుండా ఇండ్లలోంచి కలుషిత నీరు చేరకుండా తగు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా నీటిపారుదల శాఖ అధికారి జగదీష్, మున్సిపల్ కమీషనర్ ఇంద్రసేనారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రైతులందరికీ న్యాయం చేస్తా..

* పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాలకుర్తి, మే 22: రెవెన్యూ రికార్డులను సరిచేసి వారం రోజుల్లో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు, పంటసాయం చెక్కులను ప్రతి ఒక్కరికీ అందించేల అధికారులు చర్యలు చెపాట్టాలని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలో పాలకుర్తి, కొడకండ్ల రెవెన్యూ అధికారులతో సమిక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి మాట్లాడుతూ గ్రామల వారిగా రెవెన్యూ అధికారులు సభలను నిర్వహించి రికార్డులను సరిచేయాలని సూచించా రు. ఒక్కరైతుకు అన్యాయం జరిగిన సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ఆందోళన పడావల్సిన పనిలేదని న్యాయం జరిగే వారకు నాదే బాధ్యతని హమి ఇచ్చారు. ఈకార్యక్రమంలో పాలకుర్తి, కొడకండ్ల ఎంపీపీలు భూక్య దల్జీత్‌కౌర్, విజయ, మండల రైతు సయన్వయ సమితి అధ్యక్షులు యాకంతరావు, జిల్లా సమన్వయ సమితి సభ్యులు బాలునాయక్, తహసీల్ధార్ భన్షీలాల్, మండల పార్టీ అధ్యక్షులు నల్ల నాగిరెడ్డి, రామోజీ, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని కొండాపురం గ్రామ శివారు పెద్దతండకు చెందిన విద్యార్థి బదావత్ గణేష్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన ప్రపంచస్థాయి కరాటే పోటీల్లో పాల్గోని ప్రథమస్థానం పొందినందుకు ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. గ్రామీణస్థాయి గిరిజన కుటుంబనికి చెందిన పెద విద్యార్థి ప్రపంచస్థా కరాటే పోటీల్లో ప్రతిభ చూపించడం తెలంగాణకు గర్వకరణమన్నారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు భారీగా స్పందన

వరంగల్, మే22: వరంగల్‌లో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. మంగళవారం తెల్లవారు జాము నుండే రిక్రూట్ మెం ట్ ర్యాలీ ప్రక్రియ కొనసాగింది. ఇందుకోసం 40,336మంది అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోగా మొదటి రోజు 2,645మంది అభ్యర్ధులను పిలిచామని 234మంది అభ్యర్ధులు అర్హత సాధించినట్టు డైరెక్టర్ ఆఫ్ ఆర్మీరిక్రూట్ మెంట్ హైదరాబాద్ పవన్‌పూరి తెలిపారు. నేటి నుండి ఈనెల ఆఖరు వరకు ఆర్మీ రిక్రూట్ మెంట్‌లు కొనసాగుతాయి. 4 వేల మంది అభ్యర్ధుల ఎంపిక నిమిత్తం వరంగల్‌లో ఆర్మీరిక్రూట్ మెంట్ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈర్యాలీ కోసం జిల్లా యంత్రాంగం హన్మకొండలోని జెఎన్‌ఎస్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేసింది. గత నెల 5నుండి ఈనెల 5వరకు ఆన్‌లైన్ ద్వార అభ్యర్ధుల దరఖాస్తులు స్వీకరించారు.

పిచ్చోళ్ల భరతం పడుతున్నారు..
* అనుమానస్పదంగా కనిపించారా.. అంతే సంగతులు..!
* వదంతులతో కొత్తవారిని చూసి హడలిపోతున్న జనం * సామాజిక మాద్యమాలతో మరింత బెంబేలెత్తుతున్న ప్రజలు
కేసముద్రం, మే 22: ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్న చందంగా మతిస్థిమితం లేకుండా తిరిగేవారిని జనం పట్టుకొని చితక్కొడుతున్నారు. ఓ ఐదుగురి ముఠా తిరుగుతోందట.. వాళ్లకు పసిపిల్లలు దొరికితే అంతేనటా.. వారిని చంపి మెదడు తింటున్నారట.. బీహార్ నుండి దొంగల ముఠా వచ్చిందట.. అడ్డుకోబోతే చంపేస్తారట.. ఇలాంటి మెస్సెజ్‌లు తరచుగా వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతుండటంతో గత నాలుగు రోజులుగా జనం కొత్తవారిని చూస్తే చాలు హడలిపోతున్నారు. కొత్త ముఖాలు కనిపిస్తే చాలు సవాలక్ష ప్రశ్నలు వేయడంతో పాటు సరైన సమాదానం చెప్పకపోతే అనుమానితుల ఒల్లు హూనం చేసేసేస్తున్నారు. ఎండాకాలంలో మతిస్థిమితం సరిగాలేని వారు రోడ్ల వెంట తిరగడం జరుగుతోంది. అయితే ఇటీవల దొంగల ముఠా తిరుగుతోందని, తమిళనాడు ముఠా సంచరిస్తోందనే వార్తల నేపధ్యంలో జనం ఇసుమంత అనుమానం వచ్చినా వారిని పట్టుకొని చెట్టుకు కట్టేయడమో.. చేతులు కట్టేయడమో చేస్తూ యక్షప్రశ్నలు వేసి చితకబాదడం చేస్తున్నారు. ఈ విధంగా మహబూబాబాద్ జిల్లా నలుమూలలా ఇలాంటి ప్రచారంతో జనం రాత్రి పూట కంటిమీద కునుకులేకుండా గడపాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో సోమవారం సాయంత్రం కేసముద్రం మండలం బిచ్చానాయక్‌తండా వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి సంచరిస్తుండగా తండావాసులు పట్టుకొని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో రెండు చేతులు కట్టేసీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీరా పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా చివరకు ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని దృవీకరించి వదిలిపెట్టారు. ఇలాంటి ఘటనలు నాలుగు రోజులుగా ఎక్కడోచోట జరుగుతుండగా, అంతటా కూడా మతిస్థిమితం సరిగ్లా లేదని నిర్ధారించడం గమనార్హం. వదంతులతో జనం నిద్రలేకుండా జాగారం చేస్తుండగా, మతిస్థితిమితం సరిగ్గాలేక రోడ్లపై తిరిగేవారి పరిస్థితి దయనీయంగా మారింది.
కొత్త ప్రదేశాలకు వెళ్లేవారు తస్మాత్ జాగ్రత్త: కొత్త ప్రదేశాలకు వెళ్లేవారు కాస్త జాగ్రత్త వహించాల్సిన ప్రత్యేక పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. వీలైనంత వరకు తమ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లడం, ఎక్కడికైనా వెళితే వారు అడిగే ప్రశ్నలకు సులువుగా అర్ధమయ్యే తరహాలో సమాదానం ఇవ్వాలని, తడబాటుకు గురైతే దేహశుద్ధికి గురికాక తప్పదంటున్నారు.