వరంగల్

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, మే 25: వలస లంబాడాలను ఎస్టీ జాబితానుండి తొలగించాలని, 5వ షెడ్డ్యూల్డ్ ప్రాంతాన్ని పెసా చట్టం ప్రకారం జూన్ 2న మా ఊళ్ళో-మా రాజ్యం ప్రకటించుకుందామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం లండాడాలకు పెద్దపీట వేసి నిజమైన ఎస్టీలకు అన్యాయం చేస్తున్న క్రమంలో రాజ్యాంగ విరుద్దమైన ఈ పాలన మాకొద్దని, మనల్ని మనమే పాలించుకునేందుకు జూన్ 2న మా ఊళ్ళో-మారాజ్యంను రాజ్యాంగ బద్దంగా నెరవేర్చుకుందామని తుడుందెబ్బ రాష్ట్ర కమిటి శుక్రవారం పిలుపునిచ్చింది. ఏజన్సీ ప్రాంతాలలో గ్రామ సభలు నిర్వహించి, లంబాడా ఉపాధ్యాయులను పాఠశాలలకు రానివ్వద్దని తీర్మాణం చేయాలన్నారు. షెడ్డ్యూల్డ్ ప్రాంతంలో అక్రమంగా ఐటిడిఎ పరిధిలోని 29 శాఖల్లో ఉద్యోగాలు చేసే లంబాడాలను తొలగించేలా తీర్మాణాలు చేద్దామని, మా ఊళ్లో మా రాజ్యం కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పధకాలను, రుణాలను తిరస్కరిద్దామని, ప్రభుత్వ అధికారులను గూడేల్లోకి రాన్వికుండా అడ్డుకునేలా తీర్మాణాలు చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తుడుందెబ్బ, ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్, ఆదివాసీ విద్యా ర్ధి సంఘం, ఆదివాసీ మహిళా సంఘం, ఆదివాసీ రైతు సంఘం, ఆదివాసీ యువజన సంఘం నాయకులు పులిశె బాలకృష్ణ, నల్లెబోయిన లక్ష్మణ్‌రావు, కొర్నబెల్లి రాఘవరావు, కొమరం వెంకటేశ్వర్లు, దబ్బగట్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.

10 లక్షల మందితో రెడ్ల సమరభేరి సభ
* వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర జగన్మోహన్‌రెడ్డి
నర్సంపేట, మే 25: హైద్రాబాద్‌లోని రాజబహాదూర్ వెంకటరమణారెడ్డి ప్రాం గణం ఔటర్ రింగ్ రోడ్‌లో ఈనెల 27న పది లక్షల మందితో రెడ్ల సమరభేరి సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు రెడ్డి సంఘాల ఐక్య వేదిక వరంగల్ రూర ల్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. నర్సంపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరలు సమావేశంలో జగన్మోహన్‌రెడ్డి మాట్లాడారు. గౌరెల్లి సమీపంలోని దారామతిపేటలో సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈసభకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. అదే విధంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద రెడ్డి కులస్థుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టేందుకు పూనుకోవడం శుభపరిణామమని అన్నారు. రెడ్ల న్యాయమైన సమస్యలను వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టో లో చేర్చి అమలు చేయాలని కోరారు. వరంగల్ రూరల్ జిల్లా నుండి రెండు వేల కార్లు, 450 బస్సులు, రైళ్లు, ఆర్టీసీ బస్సులలో తరలివచ్చేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. ఈసమావేశంలో రెడ్డి సంఘాల ఐక్య వేదిక నాయకులు గోపు జయపాల్‌రెడ్డి, తౌటిరెడ్డి క్రిష్ణారెడ్డి, కంది గోపాల్‌రెడ్డి, బొద్దిరెడ్డి నర్సింహారెడ్డి, బోదె ప్రభాకర్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, మల్లాడి రవీందర్‌రెడ్డి, కుందూరు వెంకట్‌రెడ్డి, గాయపు మాధవరెడ్డి, మోతె తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.