వరంగల్

రఘునాథపల్లిని సందర్శించిన జార్ఖండ్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘునాథపల్లి, మే 25: రాష్ట్రంలో మహిళ స్వయం సహాయక బృందాల పనితీరును ఆధర్శంగా తీసుకొని తమ రాష్ట్రంలో మరింత ముందుకు పోతామని జార్ఖండ్ స్టేట్ లైవ్‌లీవుడ్ ప్రమోషన్ సొసైటీ (జేఎస్‌ఎల్‌పీఎస్) ప్రొఫేషనల్ టీం మేనేజర్ వెంకటేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని మహిళ స్వయం సహాయక సంఘాల పనితీరుపై అవగాహన కార్యక్రమంలో భాగంగా జార్ఖండ్ బృందం రఘునాథపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని మహళా సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి గ్రామాఖ్య సం ఘాలు నిర్వహిస్తున్న పొదుపు, లావాదేవిలు, బుక్ మేయింటెనెన్స్, బ్యాంక్ లావాదేవీలు తదితర వ్యవహారాలను జార్ఖండ్ ప్రతినిథుల బృంధానికి ఏపీఎం భవాని వివరించారు. 20 సంవత్సరాలుగా మహిళా స్వయం సహాకార సంఘాల పనితీరు, వాటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు, సామాజిక సేవలు, నైబర్‌హుడ్ సెంటర్ నిర్వాహణపై ఏపీఎం భవాని వివరించారు. అనంతరం జార్ఖండ్ ప్రతినిధుల బృందం వెంకటేశ్, ముస్త్ఫాలు మాట్లాడుతూ ఎన్‌ఐఆర్‌డీ (నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్) ఆధ్వర్యంలో మూడురోజులుగా తెలంగాణలో పర్యటిస్తు మహిళా సంఘాల పనితీరు, వాటి ఆవశ్యకత ను తమ బృందం అవగాహన చేసుకొని మా రాష్ట్రం లో అమలుచేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఈసీ హైమావతి, పీఎం శ్రీనివాస్, వసంత, శ్రీలత, బాలమ్మ, రమాదేవి, సీసీ రీణావతి, భాగ్యలక్ష్మి, జంపయ్య, సరోజన పాల్గొన్నారు.