వరంగల్

తప్పులు దిద్దుకుంటున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, మే 25: రైతుబంధు పథకంలో రైతులకు అందించిన పట్టాపాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పులను అధికారులు సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల ఆంధ్రభూమి దిన పత్రికలో ‘గందరగోళంగా రైతుబంధు’ పేరుతో ప్రచూరితమైన వార్తా కధనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు దిద్దుబాటు చర్యలకుపక్రమించారు. మండల వ్యాప్తంగా రైతుబంధు పథకంలో 11,228 మంది రైతులకు సాగు పెట్టుబడి చెక్కులు రాగా, 9970 పట్టాపాస్ పుస్తకాలు సరఫరా చేశారు. అయితే ఇందులో అనేకమంది రైతుల ఫోటోలు మారిపోగా, మరికొందరి భూమి పూర్తిగా నమోదు కాకపోవడం, ఇంకొందరి పేర్లు తప్పుగా అచ్చుకావడం, చనిపోయినవారి పేర్లతో రావడం, భూమి విక్రయించినా కొన్నవారి పేర్లు కాకుండా పాతవారితోనే రావడం జరిగింది. ఈ తరహాలో మండల వ్యాప్తంగా 1,081 మంది ఉండటంతో పాటు ముసాయిదా ప్రకటన సమయంలో తప్పులు దొర్లినట్లు ఫిర్యాదు చేయగా, సరిచేసినా మళ్లీ అదే తరహలో 874 మందికి పట్టాపాస్ పుస్తకాలు రావడం జరిగింది. దీనితో ఈ నెల 16 వరకు పట్టాపాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేసిన తరువాత రైతుల నుండి తప్పులపై ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో మూడు సార్లు డేటాబేస్ మార్చడంతో సాంకేతిక సమస్యలతో తప్పులు యదాతధంగా వచ్చాయని రెవెన్యూ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సాగుకు పెట్టుబడి కోసం వచ్చిన నగదు చెక్కు తీసుకోవడానికి ఆటంకంగా మారడంతో అనేక మంది రైతులు తప్పుల సవరణ కోసం తహశీల్ ఆఫీసు చుట్టూ తిరగడం ఆరంభించారు. ఈ నేపథ్యంలో ఆయా సమస్యలపై ‘ఆంధ్రభూమి’లో వార్తా కధనం ప్రచూరించడంతో పాటు ఇదే తరహాలో జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా తప్పులు దొర్లిన ఘటనలు కోకొళ్లలుగా జరగడంతో ముఖ్యమంత్రి కేసీ ఆర్ రెండు రోజుల క్రితం రెవెన్యూశాఖ పనితీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తప్పులను తక్షణం సరిచేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు జారీ చేయడంతో పాటు నగదు చెక్కులు అందించాలని ఆదేశించినట్లు సమాచారం. ఎలాంటి తప్పుల్లేకుండా ఇక్కడిక్కడే కొత్తగా పాస్‌పుస్తకాలను జారీ చేయడానికి ప్రత్యేకంగా ‘అధునాతన ప్రింటర్’ తెప్పించారు. ఈ మేరకు మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలతో పాటు రైతుల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించడంతో పాటు సవరణ, తప్పుల దిద్దుబాటుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసినట్లు స్థానిక తహశీల్ధార్ యోగీశ్వర్‌రావు తెలిపారు. భూమి వివరాలు ప్రజలందరు నేరుగా ఆన్‌లైన్‌లో చూసుకునే విధంగా రూపొందించిన ‘్ధరణి’ సాఫ్ట్‌వేర్‌లో తప్పుల సవరణ ఆప్షన్ ఈ నెల 28 నుండి అందుబాటులోకి వస్తుందని, ఆ లోగా క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేసి తప్పులన్నీ సవరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో తప్పులు దొర్లిన పాస్‌పుస్తకాలను సవరించి రైతులకు అందించడం జరుగుతుందన్నారు.