వరంగల్

వసతులు కరువు.. రోడ్డే దిక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే25: వరంగల్ నగరంలో కొనసాగుతున్న ఆర్మీరిక్రూట్‌మెంట్ ర్యాలీకి భారీ స్పందన ఉంది. వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చా రు. కానీ.. అభ్యర్ధులకు కనీస ఏర్పాట్లు కల్పించడంలో అధికారులు విఫలమ య్యారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు ముందుగా చెప్పినప్పటికీ సరైన వసతులు లేక అభ్యర్థులు అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. అభ్యర్థులకు కనీస సౌకర్యాలు లేక రోడ్లపైనే సేదతీరుతున్నారు. రాత్రి పూట బస్టాం డ్ సమీపంలో ఉన్న గార్డెన్‌లో పడుకుంటూ తాత్కాలిక శిభిరంలో భోజనాలు చేస్తున్నారు. మరో వారం రోజుల పాటు రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగనుంది. కాగా, శుక్రవారం జరిగిన రిక్రూట్‌మెంటుకు 3,600 మంది అభ్యర్ధులు హాజరుకాగా అందులో నుండి 400 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం 40,336 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడే కాదు!
* నన్ను తొలగించే అధికారం ఆయనకు ఎక్కడిది..? * కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి ఆరోపణ
మహబూబాబాద్, మే 25: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా తప్పుడు ప్రచారం చేసుకుంటున్న జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డికి కాంగ్రెస్‌పార్టీకి మేలు చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదని రెండుసార్లు పార్టీకి వెన్నుపొటు పొడిచిన చరిత్ర ఆయనదని మహబూబాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నూతన పట్టణ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షునిగా రాజుగౌడ్‌ను నియమిస్తున్నట్లు వచ్చిన ప్రకటనపై పట్టణ కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మహబూబాబాద్‌లోని ఆర్ అండ్ బి అతిధిగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు భరత్‌చందర్‌రెడ్డి తీరుపై మండిపడ్డారు. ముల్లంగి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. భరత్‌చందర్‌రెడ్డి కాంగ్రెస్ వెన్నుపోటుదారు.. పార్టీ అదిష్టానం ఎక్కడ భరత్‌చందర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చెప్పలేదని ఇప్పటికీ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా నాయిని రాజేందర్‌రెడ్డి మాత్రమే కొనసాగుతున్నారన్నారు. ఇందుకు సంబంధించి అఖిలభారత కాంగ్రెస్‌పార్టీ విడుదల చేసిన ఉత్తర్వులలో.. 13 మంది అధ్యక్షుల పేర్లు మాత్రమే ఉండడం, అందులో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షునిగా చెప్పుకుంటున్న జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి పేరు లేకపోవడం ఆయన మీడియాకు చూపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని అని చెప్పుకుంటూ పార్టీని బలహీనపరిచే చర్యలకు భరత్‌చందర్‌రెడ్డి పాల్పడుతున్నారని విమర్శించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుచిత్రాబాలునాయక్, యువకుడు హుస్సెన్‌నాయకను, మరికొందరు గిరిజన నాయకులను భరత్‌చందర్‌రెడ్డి ఇష్టారీతిగా దూషించాడన్నారు. తనను పట్టణకాంగ్రెస్ అధ్యక్షునిగా తొలగించే అధికారం భరత్‌చందర్‌రెడ్డికి లేదని ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని సూచించా రు.ఇంతకాలంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిని అని చెప్పుకుంటున్న భరత్‌చందర్‌రెడ్డి కేవలం మాట వరుసకే అధ్యక్షుడని పార్టీ దృష్టిలో జిల్లా అధ్యక్షుడు కాదని తెటతెల్లమైంది. విలేఖరుల సమావేశంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ శశివర్ధన్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

గుడిసె కనపడొద్దు...
* అందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తా..* ఎమ్మెల్యే శంకర్‌నాయక్ హామీ
నెల్లికుదురు, మే 25: గ్రామంలో మళ్లి గుడిసె కనపడొద్దని అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరీ చేయిస్తానని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నా రు. మండలంలోని బ్రహ్మణకొత్తపల్లిలో సబ్సిడీ గొర్రెలకు ధాన పంపిణీ, మేచరాజుపల్లిలో మిషన్ కాకతీయ పనులను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు మాధగాని యాదమ్మ, ఎర్రబెల్లి మాధవిల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడు తూ.. బ్రహ్మణకొత్తపల్లిలో గుడిసంటూ ఉండకూడదని ఎన్ని ఇళ్లు అయినా మంజూరు చేయిస్తానని గ్రామానికి చెందిన గోపాల కిషన్‌రావు ఇందుకు చొరవ చూపాలని అన్నారు. గొల్లకుర్మలకు గొర్లు, మత్సకార్మికులకు ఉచితంగా చేపపిల్లలు, రైతుల భూములకు ఉచితంగా పట్టాలు, పెట్టుబడి రూపాయలు కులంతో సంబందం లేకుండా పెళ్లి కుమార్తెకు కళ్యాణలక్ష్మి, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి, పాఠశాలలు, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం తదితర పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో మొదటి స్థానంలో నిలిపారన్నారు. అనంతరం యాదవులకు ఉచిత ధానాను పంపిణీ చేశారు. మేచరాజుపల్లిలో మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పడమటి చెరువును రూ.54.55లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ప్రారంభించారు. పడమటిగడ్డ తండాకు రూ.5లక్షలతో రోడ్డు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో సుఖంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతుసమన్వయ సమితి కో ఆర్డినేటర్లు బాలాజీ, వెంకటేశ్వర్‌రెడ్డి, గోపాల కిషన్‌రావు, నవీన్‌రావు, తిరుపతిరెడ్డి, మండ ల పశువైద్యాధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సహాయ కేంద్రాలు 27న పనిచేస్తాయి
కేయు క్యాంపస్, మే 25: తెలంగాణ కమిషనర్ కాలేజియోట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఆదేశాల మేరకు డిగ్రీ కోర్సులల్లో ప్రవేశాలు పొందగొరు విద్యార్థుల అభ్యర్ధన దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు విశ్వవిద్యాలయ పరిధిలోని దోస్త్ సహాయ కేంద్రాలు ఆదివారం పనిచేస్తాయని కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ పురషో త్తం ప్రకటించారు. అభ్యర్ధులు గమనించాలని వారు తెలిపారు.

లాసెట్ 2018 పరీక్ష ప్రశాంతం
కేయు క్యాంపస్, మే 25: లాసెట్-2018 మొదటి సారిగా నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. విశ్వవిద్యాలయ పరిధిలో 8 సెంటర్లలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి సాంకేతిక సమస్యలు తలేత్తకుండా నిర్వహించారు. మొత్తం 1,850 మంది అభ్యర్ధులకు గాను 1,505 మంది అభ్యర్ధులు హాజరైనారని రీజనల్ కో ఆర్డీనేటర్ తెలిపారు.

‘కేసముద్రం’కు పోటెత్తిన మక్కలు
కేసముద్రం, మే 25: కేసముద్రం మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రానికి శుక్రవారం మక్కలు వెళ్లువలా వచ్చాయి. దాదాపు 13 వేల బస్తాలకు పైగా మక్కలు విక్రయానికి తేవడంతో టోకెన్ జారీ కేంద్రం రహాదారిలో ట్రాక్టర్లు, టాటా ఏస్ వాహనాలు బారులు తీరాయి. కేసముద్రం మార్కెట్‌కు పసుపు, ధాన్యం అధికంగా వస్తుండటంతో మక్కల కొనుగోళ్లను మూడు మిల్లుల్లోకి మార్చారు. ఆ మేరకు స్థానిక తహశీల్ కార్యాలయం వద్ద ఉదయం పూట టోకెన్లు జారీ చేసి మిల్లు ల్లో వెసులుబాటును బట్టీ తరలించడం జరుగుతోంది. ఈ నేపధ్యంలో శుక్రవారం భారీగా మక్కలు రావడంతో మూడు మిల్లులతో పాటు మరో మిల్లుకు పంపగా, అక్కడ కూడా కార్మికులు, స్థలం ఆశించినంతగా లభ్యత లేక పోవడంతో తిరిగి మార్కెట్‌కు పంపారు. దీనితో గత ఐదు రోజులుగా మార్కెట్లో కనిపించని మక్కలు తిరిగి ప్రత్యక్షమయ్యాయి. ప్రైవేట్ ట్రేడర్లు మక్కలకు క్వింటాలుకు 1,100 రూపాయలలోపు ధర పెడుతుండటం, మార్క్‌ఫెడ్ 1,425 రూపాయల ధర పెడుతుడంటంతో మార్క్‌ఫెడ్ కు మక్కలు విక్రయించేందుకు రైతులు పోటీ పడుతున్నారు. దీనితో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రానికి వెళ్లువగా మక్కలు వస్తున్నాయి.

పేదలకు అండగా టీడీపీ జెండా
* పల్లెప్రగతిలో పాదయాత్రలో రేవూరి
నల్లబెల్లి, మే 25: పేద బడుగు బలహీన వర్గల కోసంమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ జాతీయ కార్యదర్శి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో పల్లె పల్లెకు తెలుగుదేశం అనే కార్యక్రమంపై టీడీపీ పోలీట్‌బ్యూరోసభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. అంత కు ముందుగా మాజీ ఎమ్మెల్యే రేవూరికి టీడీపీ మహిళ కార్యకర్తలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని ఇంటింటికి వెల్లి ప్రభుత్వ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకుంన్నారు. నాడు టీడీపీ నేడు టీఆర్‌ఎస్ పరిపాలన ఎలా ఉందని ప్రజలను అడిగి తెలుసుకుంన్నారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే ఓక్క తెలుగుదేశం పార్టీతోనే అన్నారు. నేడు రైతుబంధు పథకంలో సైతం అధికారులు. అధికార పార్టీ నాయకులతో అవినీతి రాజ్యమేలుతుం టే పట్టించుకునే నాదుడే కరువైనాడని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సంతోష్, మోహన్‌రెడ్డి, నర్సింగరావు, పర్వాతాలు, రాజు, కుమారస్వామితో పాటు పలువురు హహిళలు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే సీఎం లక్ష్యం
* గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్

వరంగల్, మే 25: గ్రామాల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని, బంగారు తెలంగాణ దిశగా ముందుకు పోయేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నాయని ఆయన అన్నారు. శుక్రవారం మహుబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్‌తో కలిసి ములుగు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి చందులాల్ శ్రీకారం చుట్టారు. ములుగు మం డలం దేవనగర్‌లో సీడీపీ, పీఆర్‌ఆర్‌గ్రాంట్ ద్వారా మంజూరు అయిన 5లక్షల నిధులు ఎంజీఎన్‌ఆర్‌ఈజిఎస్ గ్రాంట్ ద్వారా మంజూరు అయిన 5లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును మంత్రి చందులాల్ ప్రారంభించారు. రే గొండ మండలం జాకారం గ్రామంలో 5కోట్ల 60 లక్షల నిధులతో రోడ్డు వెడల్పు పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. తర్వాత అబ్బాపూర్ గ్రామంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ గ్రాంట్ ద్వారా 5లక్షల నిధులు, సీడీపీ గ్రాంట్ ద్వారా మంజూరు అయిన 5 లక్షల నిధులు, సీడీపీబీబీగ్రాంట్ ద్వారా మంజూరు అయిన 10లక్షల నిధులతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను, అదే విధంగా ఎంపీ లాడ్స్ ద్వారా 2016-2017 గ్రాంట్ ద్వారా మంజూరు అయిన 5లక్షల నిధులతో నిర్మింతమైన సీసీ రోడ్డును కూడా మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రహ్లాద్, జెడ్సీటీసీ శోభ, సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు చేస్తే నేరం
* బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
* స్ర్తి, శిశు సంక్షేమ రీజినల్ ఆర్గనైజర్ కమరిన్నీసాబేగం
పరకాల, మే 25: బాల్య వివాహాలు చేస్తే చట్ట ప్రకారం నేరమని, వీటిని ప్రోత్సహించిన నేరమని స్ర్తి, శిశు సంక్షేమ రీజినల్ ఆర్గనైజర్ కమరిన్నీసాబేగం అన్నారు. శుక్రవారం పరకాల పట్టణంలో బాల్య వివాహం నిరోధక చట్టంపై డివిజనల్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పరకాల ప్రాజెక్ట్ సీడిపీఓ స్వర్ణలత అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా స్ర్తి, శిశు సంక్షేమ రిజనల్ అర్గనైజర్ కమరీన్నిసాబేగం, జిల్లా సంక్షేమ అధికారి ఎం. సబితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టం స్థానంలో ప్రభుత్వం కొత్త బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. దీని ప్రకారం బాలికలకు 18 సంవత్సరాలు, బాలుడికి 21 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేస్తే చట్టప్రకారం నేరమని, వీటిని ప్రోత్సహించిన నేరమని పేర్కొన్నారు. వీటికి కఠినమైన శిక్షలు ఉంటాయన్నారు. బాల్య వివాహాలను అరి కట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. బాల్య వివాహాలు జరిపిస్తే వెంటనే అంగన్‌వాడీ కార్యకర్తలకు, సూపర్‌వైజర్లు, మహిళా శిశు సంక్షేమ అధికారులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం బాలల సంరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ బాలల హక్కుల ఉల్లంఘన జరిగినట్లు సమాచారం తెలిస్తే వెంటనే జిల్లా అధికారులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం బాల్య వివాహా నిరోధక చట్టం కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో పరకాల జడ్పిటీసీ పాడి కల్పనాదేవి, పరకాల ఎంపిపి నేతాని సులోచన, ఎంపిడీఓ శ్రీనివాసారావు, ఐసిడియస్ పద్మలత, అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

ఎవరెటు..గెలుపెటు
* పంచాయతీ ఎన్నికల గెలుపుపై అప్పుడే రాజకీయ నాయకుల ఆరా..
పరకాల, మే 25: పంచాయతీ ఎన్నికలకు అం తా సిద్ధమవుతుంది. అనుకున్నట్లుగానే జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమైంది. ఎన్నికల కమిషన్ ఆదేశా ల మేరకు అందుబాటులో ఉన్న ఉద్యోగాలు, బ్యా లెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రం ఆధారం ప్రణాళిక తయారు చేస్తున్నారు. రైతులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలతో పాటు చెక్కుల పంపిణీ కార్యక్రమంతో పరిస్థితి కొంత సానుకూలంగా ఉందని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలోనే గ్రామాల్లో పంచాయతీ సమరం నిర్వహిస్తే తమకు అనుకూలంగా ఉంటుందని కింద స్థాయి కార్యకర్తలు, రెండో శ్రేణి నాయకత్వం, అధి నాయకత్వం భావిస్తుండగా, కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు మాత్రం రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేయకపోవడం, మద్దతు ధరకు బోనస్ ఇవ్వకపోవడం, మహిళ సంఘాలకు తిరిగి చెల్లించకుండా లక్ష రూపాయాలు అందచేస్తామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడం తమకు అనుకూలంగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ దరిమిలా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎవరెట్టు ఉన్నారని, గెలుపెట్టు అనే దానిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు దృష్టి సారించారు. ఇప్పటికే పంచాయతీలు, ఓటర్ల సంఖ్య, వార్డులపై కసరత్తు పూర్తి చేసిన అధికార యంత్రాంగం కులాల వారీగా ఓట్ల గణనపై దృష్టి సారించింది. ఈ గణాంకాలై స్పష్టత వస్తే పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుంది. దీంతో ఏయే గ్రామాల్లో తమకు అనుకూలంగా ఉన్న కులాల ఓట్లు ఎన్ని ఉన్నాయి? సంక్షేమ పథకాల లబ్దిదారులు ఏ కులాల్లో ఎంత మంది ఉన్నారు? ప్రభుత్వం తీరుపై వారి అభిప్రాయాలు ఏలా ఉన్నాయి? యువత, మహిళలు ఎవరి వైపు ఉన్నారనే వివరాలను ఉమ్మడి జిల్లా లోని ప్రజాప్రతినిధులు అప్పుడే లెక్కలపై దృష్టి సారిస్తు లెక్కలు వేస్తు అందుకు వ్యూహ రచనలు చేస్తున్నారు. మరికొందరు తమకు అనుకూలంగా ఉన్న నిఘా వర్గ అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో పార్టీ రహితంగానే జరిగినా పార్టీ మద్దతుదారులు ఎక్కవ చోట్ల విజయం సాధిస్తే ఆ ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఉంటుందనేది వారి అభిప్రాయం. 2013లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ వర్సస్ కాంగ్రెస్ మద్య పోరు జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్న ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే పోలింగ్ బూత్‌ల వారీగా విశే్లషణలు మొదలయ్యాయి. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికాగానే అభ్యర్థిని ప్రకటించాలని ముందస్తు ప్రణాళిక దృష్ట్యా ఏ అభ్యర్థికి విజయావకాశాలున్నాయనేది క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ పని తీరు, ఎమ్మెల్యేల బలబలాలపై ఎప్పటికప్పుడు నివేదికలు సిద్ధం చేస్తున్న సీఎం కేసీఆర్ పంచాయతీ ఎన్నికల ఫలితాల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో కొంత మంది రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వచ్చే నెల పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే వార్తలు వస్తుండడంతో దీంతో ఎవరికి వారే ప్రణాళికలు సిద్దం చేసుకుంటు సమరానికి సిద్దం అవుతుండడంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వేడి ప్రారంభమైంది.