వరంగల్

‘పంచాయతీ’కి సర్వం సన్నద్ధం.. * రిజర్వేషన్‌ల ప్రకటనపైనే సర్వత్రా ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూన్ 16: జూలై మొదటివారంలో ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు వచ్చితీరుతాయని.. ఈనెల 25వ తేదీలోగా పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్‌ల ప్రకటన జరిగిపోతుందని అధికారులు, రాష్ట్ర మంత్రులు ప్రకటనలు గుప్పిస్తుండడంతో మహబూబాబాద్ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఎన్నికల వేడి కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో 461 గ్రామపంచాయతీలు, 4030వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఓటర్ల లెక్కింపు ప్రక్రియను కూడా అధికారయంత్రాంగం పూర్తిచేసింది. జిల్లాలో మొత్తం 4,53,295 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్కతేల్చారు. వీరిలో అత్యధికంగా ఎస్టీ ఓటర్లు 1,87,912 మంది ఉన్నారు. తరువాత స్థానంలో బీసీలు 1,73,556మంది ఉన్నారు. ఎస్సీలు 61,148 మంది, ఇతరులు 30,679 మంది ఓటర్లను నిర్ధారించారు. ఇప్పటికే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరుగతులను కూడా నిర్వహించారు. ఎన్నికల నిర్వాహణకోసం కర్నాటక నుంచి 3303 బ్యాలెట్‌బాక్స్‌లను తెప్పించి సిద్ధంగా ఉంచారు. నూతనంగా ఏర్పాటు చేయబడిన తండా పంచాయతీలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించారు. దీంతోపాటు అదనంగా గ్రామాల్లోనూ ఐదుశాతం రిజర్వేషన్‌ను ఎస్టీలకు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడంతో వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీ సామాజిక వర్గానికి పదవుల పంట పండే అవకాశాలు ఉన్నాయి.
మూడు విడతల్లో జిల్లాలో ఎన్నికలు..
మహబూబాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలను మూడు విడుతల్లో నిర్వహించడానికి అధికార యంత్రాంగం సమాయత్త అయింది. మొదటి విడుతలో నెల్లికుదురు మండలంలోని 36, మహబూబాబాద్ మండలంలోని 41, కేసముద్రంలోని 40, గూడూరులో 39గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడుతలో మొత్తం 156పంచాయతీలకు 1370వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. రెండవ విడుతలో ఐదు మండలాల పరిధిలోని 149పంచాయతీలు, 1294వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండవ విడుత ఎన్నికలు జరిగే మండలాల్లో దంతాలపల్లి 17, మరిపెడ 44, చిన్నగూడూరు 10, కురవి 48 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మూడవ విడుతలో ఏడు మండలాల్లోని 156పంచాయితీలు, 1366వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడవ విడుతలో డోర్నకల్‌లో 22, గార్లలో 20, బయ్యారంలో 29, గంగారం 12, కొత్తగూడలో 24, పెద్దవంగరలో 20, తొర్రూరులో 29 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సమాయత్తమై సిద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబందించిన పోలింగ్ స్టేషన్‌లను, ఇతర ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు సిద్దంచేసుకొని ఉండడంతో ఏక్షణం ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైనా నేరుగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే పరిస్థితిలో ప్రస్తుతం జిల్లా యంత్రాంగం కనిపిస్తుంది. గ్రామాల్లోనూ అన్ని రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతుంది. అధికార తెరాసలో తెరాసతోపాటు ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌లోనూ ఇప్పటికే పోటీ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. వీటితోపాటు అన్ని రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా నిరూపించుకునేందుకు తద్వారా రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ బలాన్ని చాటేందుకు సన్నద్దం అవుతున్నాయి. మొత్తంగా మహబూబాబాద్ జిల్లాలోని ప్రతి పల్లెలోనూ ఎన్నికల వాడి వేడి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.

సబ్సిడీ విత్తనాల జాడేది..?
గంగారం, జూన్ 16: కరీఫ్ సీజన్ మొదలైనా గంగారం మండల వ్యవసాయ కార్యాలయానికి ఇంతవరకు ఏ విత్తనాలు రాకపోవడంతో మండలంలోని రైతులు విత్తనాల కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. రైతులు రైతుబంధు చెక్కులు విడిపించుకొని మండలంలో ప్రధానంగా పండే మొక్కజోన్న విత్తనాల కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతులు అప్పులు చేసి మరీ విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వాలు వర్షాకాలం రాకమునుపే ఐటిడిఏ ద్వారా ఏజెన్సీ మండలంలోని రైతులందరికీ సబ్సిడీ విత్తనాలు అందజేసేవారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం రైతుల విత్తనాల విషయంలో నిమ్మకునీరేత్తనట్లు ఉంటుందని.. విత్తనాలు వేయడానికి అనుకూలంగా ఉందని విత్తనాల విషయం లో ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక ధరలకు కొనాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయంలో తగు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ అధికారి ఇన్‌చార్జ్‌గా ఉండి అందుబాటులో లేకపోవడంతో రైతులు వ్యవసాయం ఎలా చేయాలంటూ అయోమయంలో పడిపోతున్నారు.