వరంగల్

భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 16: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. వరంగల్ నగరంలోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే కొండ సురేఖలు ముస్లిం పెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఖిలా వరంగల్‌లోని ఈద్గా వద్ద ముస్లింలతో కలిసి నగర మేయర్ నన్నపునేని నరేందర్ ప్రార్ధనలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షులు తెలిపారు. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర శాసనసభా స్పీకర్ మధుసూదనాచారి ముస్లింలతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. రూరల్ జిల్లా పరకాలలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి ముస్లింలను కలిసి వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హిందువులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. అంతకు ముందు రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లిం సోదరులు వేకువజామునే లేచి స్నానం ఆచారించి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించారు. సుగంధ ద్రవ్యాలు పుసుకుని పండుగకు ముందే పిత్ర దానం చెల్లించి పండుగ రోజు కూడా పేదలకు ధాన ధర్మాలు చేశారు. అందరు కలిసి సమూహికంగా తక్వీర్ పటిస్తూ ఈద్గాల వద్ద సమూహిక ప్రార్ధనలు చేసి ఒకరునొకరు అలాయ్‌బలాయ్ తీసుకుని, ఈద్ ముభారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిత్యం అల్లా నామస్మరణతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి శనివారం రంజాన్ పండుగను మదినిండుగా ఆస్వాదించారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని పోలీసులు ఈద్గాలు, మజీద్‌ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
పరకాలలో..
పరకాల: పరకాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈద్గాలో ప్రార్థనలు చేసి భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకున్నారు. ఇమాములు ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి ఈద్గా మైదానానికి తరలి వచ్చి ముస్లిం సోదరులను అలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరు లు ఒకరినొకరు అలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి సభ్యు డు, పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ అల్లా కృప ప్రతి ఒక్కరికి కలగాలని అన్నారు. కటోరా ఉపవాస దీక్షలు చేస్తూ ఉపవాసాలు చేసి రంజాన్ పండుగను జరుపుకోవడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇనగాల వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు పసుల రమేష్, నలుబోల క్రిష్ణయ్య, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అలీ, నజీర్, ఖైముద్దిన్, జావెద్ రఫిక్, రాంమూర్తి, దుప్పటి సాంబశివుడు, బొచ్చు చందర్, మార్క అభినయ్‌గౌడ్, దామ అనిల్, పబ్బ శ్రీనివాస్‌గౌడ్, మచ్చ సుమన్, ఈర్ల చిన్ని, జెమిని తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పరకాల నగర మున్సిపల్ చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లే బిక్షపతిలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్, టీడీపి పరకాల పట్టణ అధ్యక్షులు కొలుగూరి రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ముస్లింలకు పం డుగ శుభాకాంక్షలు తెలిపారు. పరకాల ఏసీపి సుధీంద్ర ఆధ్వర్యం లో పరకాల ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, రవిందర్‌ల ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు చర్యలు చేపట్టారు.
సంగెంలో..
సంగెం: ముస్లింల పవిత్రమైన రంజాన్ వేడుకలను మండల కేం ద్రంలో ఘనంగా నిర్వహించారు. శనివారం సంగెం మండల కేం ద్రంలో చింతలపల్లి రైల్వేస్టేషన్, షాపూరం, గవిచర్ల గ్రామాలలోని ఈద్‌గాలలోముస్లింలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం ఒకిరికి ఒకరు హిందు ముస్లిం బాహి, బాహి అంటూ అలయ్ బాలయ్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు మన్సూరీ ఆలీ, ఖాజాపాషా, ఇస్మాయోల్, పాషాత తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేటలో..
నర్సంపేట: నర్సంపేట డివిజన్‌లో శనివారం ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరైముస్లిం లకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లింలు పరస్పరం అలయ్ బలయ్ తీసుకున్నారు. అన్ని మండలాలలోని ఈద్గాల వద్ద ప్రార్ధనలు నిర్వహించారు.
రాయపర్తిలో..
రాయపర్తి: రంజాన్ పండుగను పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాలలోని ముస్లిం సోదరులు శనివారం రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. రంజాన్ వేడుకతో అన్ని గ్రామాలలోని ఈద్గాలు, మజీదులు నూతన శోభాతో అలంకరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకరులు ఎండీ యాకుబ్, నాజీర్, మైనోద్దిన్, ఉస్మాన్, సైదుల్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
ఏటూరునాగారంలో..
ఏటూరునాగారం: మండల వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. మసీదుల్లో ప్రార్ధనలు నిర్వహించి అనంతరం చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా ఒకరికొకరు అలాయ్.. బలాయ్, ఆలింగనాలు చేసుకున్నారు. కార్యక్రమం లో ముస్లిం సోదరులు వలీబాబా, ఖాజాపాష, సలీం, అజ్మత్‌ఖాన్, మల్లారెడ్డి, అక్బర్, అహ్మద్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తిలో..
పాలకుర్తి: ముస్లింలు అల్ల చూపించిన బాటలో నడిపి ప్రపంచశాంతికి కృషి చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు చూచించారు. శనివారం రంజాన్ పర్వదినాన్ని పుర్కరించుకుని ఈద్గలో నిర్వహించి ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు.ముస్లిం సంక్షేమ కోసం కృషి చేస్తున్నది కేసీఆర్‌ని చెప్పా రు. ఈకార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు నల్ల నాగిరెడ్డి, సర్పంచ్ అంజమ్మ, ఎంపీటీసీ విజయనాగన్న పాలొన్నారు.
మొగుళ్లపల్లిలో..
మొగుళ్లపల్లి: రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు మండలంలోని 20 గ్రామాల నుండి తరలివచ్చి ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా కొత్త దుస్తులు ధరించిన ముస్లిం సోదరులు హిందువులతో కలిసి కరచాలనం, అలింగనం చేసుకుంటూ మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో మజీబ్ ఇమమ్, సాహాబ్, సర్వర్, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి: పర్వతగిరి మండల కేంద్రంలో ముస్లింలు రంజాన్‌ను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ముస్లింల మత గ్రంథం అయిన ఖురాన్‌ను కృష్ణంవందే జగద్గురమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ వీరేందర్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అనిల్, అమరేందర్, తదితరులు పాల్గొన్నారు.

433 మంది పోలీసు కానిస్టేబుళ్ళ బదిలీ!
* కమిషనరేట్ పరిధిలోనే 130 మంది
* భూపాలపల్లి జిల్లాకు 111 మంది
* ఆరోగ్య, రెండేళ్ల వ్యవధికి మినహాయింపు
* కమిషనర్ డాక్టర్ రవీందర్ వెల్లడి
వరంగల్ క్రైం, జూన్ 16: రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి సూచనల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ కమిషనరేట్‌లలో విధులు నిర్వహిస్తున్న 433 మంది కానిస్టేబుళ్లను శనివారం బదిలీ చేస్తూ పోలీసు కమిషనర్ డా.వి రవీందర్ ఉత్తర్వులు జారీచేసారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న 130 మంది కానిస్టేబుళ్లను కమీషనరేట్ పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లకు బదిలీ చేశారు. అదే విధంగా కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మరో 111మంది కానిస్టేబుళ్లను భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేశారు. కమిషనరేట్ నుండి భూపాలపల్లి, భూపాలపల్లి నుండి మహబూబాబాద్‌కు, మహబూబాబాద్‌నుండి భూపాలపల్లికి అదే విధంగా సిద్దిపేట జిల్లాకు వెళ్లాలనుకున్న 56 మంది కానిస్టేబుళ్లను కమిషనర్ బదిలీ చేశారు. భూపాలపల్లి జిల్లాలోని 136 మంది కానిస్టేబుళ్లను పోలీసు కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లకు బదిలీ అయ్యారు. ఈ బదిలీలలో డీజీపీ కార్యాలయం సూచించిన ఆరోగ్య సమస్యలతో ఉన్న కానిస్టేబుళ్లు, పదవి విరమణకు రెండు సంవత్సరాలలోపు ఉన్న వాళ్లకు వారు కోరుకున్న పోలీసు స్టేషన్లలో ఖాళీలను అనుసరించి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.