వరంగల్

భూదందాగిరిపై విచారణ చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం(నూగూరు), జూన్ 16: గిరిజన సంక్షేమ చట్టాలు అమ ల్లో ఉన్న వెంకటాపురం, వాజేడు మండలాల్లో అధికారుల అండదండలతో గిరిజనేతర భూస్వాములు ప్రభుత్వ భూములను, ఆదివాసీల భూ ములను అక్రమంగా ఆక్రమించుకొని నకిలీ పత్రాలతో పట్టాలు పొందుతున్నారని, ఈ భూదందాగిరిపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని గోం డ్వానా సంక్షేమ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఆ సం ఘం జిల్లా అధ్యక్షుడు వాసం నాగరాజు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారులు సైతం భూకబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. అలాగే తహసిల్దార్ కార్యాలయాల్లో పైరవీకారులు అక్రమ దందాకు పాల్పడుతూ గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. సహాయ కార్యదర్శి నర్సింహమూర్తి, వెంకన్న, మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ చేసిన అభివృద్ధి శూన్యం
* కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి
చేర్యాల, జూన్ 16: ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వెల్ నియోజక వర్గంతో పాటు రాష్ట్రానికి చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వంటే రు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గజ్వెల్ నియోజక వర్గంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులపై ఆధారపడుతూ వారి బెదిరింపులతో వారిని పార్టీ మార్పిస్తున్నాడని, వారే ఆయనకు బలమని అన్నారు. సీఎంగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏ మండలానికీ ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. గొల్లకుర్మలకు యూనిట్లవారిగా గొర్రెలను అందించిన విషయంలో పెద్ద ఎత్తున దండుకున్నారని, గొర్రె ధర రూ. 6వేలు అయితే మార్కెట్‌లో దాని ధర రూ.3వేలు మాత్రమేనని, ఇది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కుటుం బ పాలనతో రాచరికాన్ని మరిపిస్తున్న ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. బంగారు తెలంగాణ పేరున ప్రజలను మోసం చేస్తున్న ఘనత ఆయనదేనని అన్నారు. రైతులకు రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 4వేలు చెల్లిస్తుంటే అంతకు మించి ధరలను పెంచి రైతులపై మోయలేని భారం వేస్తున్నాడని అందుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్, డిజిల్ ధరలే నిదర్శమని అన్నారు. ఈ సందర్భంగా నాయకులు కర్ణాకర్, బొందిలి గణేష్‌ప్రసాద్‌లు ఆయన వెంట ఉన్నారు.