వరంగల్

పేరుకే పెద్ద మార్కెట్.. సిబ్బందిలేక చిన్నబోతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, జూన్ 16: మహబూబాబాద్ జిల్లాలో అతిపెద్ద, ప్రత్యేకహోదా కలిగిన కేసముద్రం మార్కెట్ పేరుకే పెద్దగా నిలుస్తోంది. ప్రతి రోజు కనీసం కోటి నుండి 3 కోట్లకు పైగా, సీజన్‌లో రోజుకు 10 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతుండటంతో నిర్వాహణకు తగ్గట్టుగా ఉద్యోగులు, సిబ్బంది లేక మార్కెట్ సతమతమవుతోంది. ఈ మార్కెట్‌ను పర్యవేక్షించడానికి ప్రత్యేకహోదా కార్యదర్శితో గ్రేడ్ -3 కార్యదర్శి, ముగ్గురు సూపర్‌వైజర్లు, ఇద్దరు లోయర్ గ్రేడ్ క్లర్కులు, పంటల నాణ్యతను పరీక్షించడానికి ఒక గ్రేడర్, ఒక టైపిస్ట్, ఇద్దరు జేఎంఎస్‌లు, ఒక అటెండర్, తొమ్మిది మంది నైట్‌వాచ్‌మెన్లు ఉండాల్సి ఉంది. అయితే ఇటీవల బ్రెయిన్ ట్యూమర్‌తో కార్యదర్శి అశోక్ మృతి చెం దగా అయన పోస్టు ఖాళీగా ఉంది. అయన స్థానం లో మరొకరిని బదిలీ చేయకుండా ఇక్కడ గ్రేడ్-3 కార్యదర్శిగా పనిచేస్తున్న అంజిత్‌రావుకు అదనంగా బాధ్యతలు అప్పగించారు. అలాగే ఎల్డీసీ పోస్టులో ఒకటి, గ్రేడర్, టైపిస్ట్, ఒక జేఎంఎస్, అటెండర్, ఆరుగురు వాచ్‌మెన్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు రోజుల క్రితం మార్కెటింగ్‌శాఖ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి చేయగా కేసముద్రం మార్కెట్లో ఖాళీ గా ఉన్న పోస్టుల్లో ఏ ఒక్కటీ కూడా భర్తీ కాలేదు. కేవలం ఒకరిద్దరు ఇక్కడ నుండి బదీలీ కాగా వారి స్థానాలు మాత్రమే భర్తీ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టు ల్లో దినసరి వేతనంపై కొందరిని, ఔట్ సోర్సింగ్ విధానంలో మరికొందరిని నియమించుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా అధికులు నిత్యం రైళ్లలో కేసముద్రం వచ్చి సాయంత్రం వెళ్లి పోతుండటంతో మార్కెట్ నిర్వాహణ పూర్తిగా ఔట్‌సోర్సింగ్, దినసరి వేతనంతో పనిచేసే సిబ్బందితో వెళ్లదీయాల్సి వస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ప్రత్యక్ష పద్ధతిలో కొనుగోల్లు నిర్వహించే ఈ మార్కెట్లో ఏడాది క్రితం ఈనామ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ, ఈనామ్ అమలు తీరు పాతసీసాలో కొత్త సారా పొసిన చందంగా మారిందంటున్నారు.
సెక్యురిటీ గార్డులే గ్రేడర్లు..!
కాగా కేసముద్రం మార్కెట్లో రైతులు విక్రయానికి తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి గ్రేడింగ్ చేయడానికి గ్రేడర్ అవసరం. కొనే్నళ్లుగా గ్రేడర్ పోస్టు ఖాళీగా ఉండటంతో మార్కెట్లో దినసరి వేతనంపై పనిచేసే సెక్యురిటీగార్డులతో పంట ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించడానికి వినియోగించాల్సిన దుస్థితి నెలకొంది. దీనితో తరచుగా వారు చేసిన గ్రేడింగ్ సరిగా లేదంటూ తమకు ఆశించిన ధర లభించలేదని రైతులు ఓ వైపు, నాణ్యతలేని సరుకులకు ‘ ఏ’ గ్రేడ్ వేశామని, తీరా కాంటాల సమయంలో చూసుకుంటే నాసిరకంగా ఉందంటూ వ్యాపారులు తరచుగా పేచీలు పెడుతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈనామ్ విధానంలో గ్రేడర్‌తో పాటు ఇద్దరు ల్యాబ్ అసిస్టెంట్లు, ల్యాబ్ సౌకర్యం కల్పించాల్సి ఉండగా, అలాంటి పరిస్థితి కేసముద్రం మార్కెట్లో ఇప్పటి వరకు కల్పించలేదు.

టీఆర్‌ఎస్‌కు హామీల అమలుపై చిత్తశుద్ధి ఏది..?
నర్సంపేట, జూన్ 16: నర్సంపేట పట్టణంలో గ్రీన్‌ల్యాండ్స్, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆర్‌అండ్ బి అతిథి గృహం ఎదుట చేపట్టిన రిలే నిరాహాదీక్షలు శనివారం నాటికి రెండవ రోజుకు చేరుకున్నాయి. రిలే దీక్షా శిబిరాన్ని బీఎల్‌ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ గాదగోని రవి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఇన్‌చార్జి డ్యాగల శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బుర్రి ఆంజనేయులు, సీఐటీ యూ జిల్లా నాయకులు కందికట్ల వీరే ష్, బీఎల్‌ఎఫ్ పార్లమెంట్ కోకన్వీనర్ కన్నం వెంకన్నలు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభు త్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడమే తప్ప హామీల అమలపై చిత్తశుద్ది చూపించడం లేదని విమర్శించారు. పేదలకు అండగా ఉండాల్సిన అధికార యంత్రాంగం భూబకాసురులకు, అవినీతి పరులకు అండగా నిలుస్తోందని మండిపడ్డారు. పేదలు తమ అవసరాల కోసం పోరాడితే అణిచివేసే విధంగా పోలీసులను ప్రయోగిస్తున్నారని ఇది కేసీఆర్ నియంతృత్వ పాలనకు నిదర్శనమని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిన పాలకు లు పేదలకు నిలువనీడ కల్పించాలనే సృహ లేకపోవడం శోచనీయమని అన్నారు. హామీలు అనేకం ఇస్తూ అమలు చేయకపోవడం అన్యాయమ ని అన్నారు. రెండు పడకల గదుల నిర్మాణాన్ని ప్రారంభించి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా నాయకుడు పెద్దారపు రమేష్ మాట్లాడుతూ గ్రీన్‌ల్యాండ్స్, ప్రభుత్వ భూముల రక్షణ, పేదలకు రెండు పడకల గదుల నిర్మాణాన్ని తక్షణమే స్పం దించి చర్యలు తీసుకోకపోతే పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించా రు. ఈకార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి రాగసుధ, తుత్తుర్ల వెనె్నల, యాకూబ్, ఈశ్వర్, రాధిక, సావిత్రి, లక్ష్మీ, శే్వత, యాకలక్ష్మీ, సంధ్యారాణి, ఉమ, లలిత పాల్గొన్నారు.

ముంపువాసుల బాధలు వినండీ సారూ..
మహదేవపూర్, జూన్ 16: కాళేశ్వరం ప్రాజెక్టుతో ముంపునకు గురవుతున్న ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం చేపడుతున్న అన్నారం బ్యారేజీ వల్ల కాటారం మండలంలోని దామెరకుంట, గుండ్రాతుపల్లి, లక్ష్మీపూర్ తదితర పల్లెలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు భూపాలపల్లి ఆర్డీఓకు వినతిపత్రం అందించామని తెలిపారు. ముంపు ప్రాంత ప్రజల బాధలను ఆలకించి, బ్యారేజీ నిర్మాణ పనులలో మార్పులు చేయాలని గుండ్రాతుపల్లి ప్రజలు కోరారు.