వరంగల్

ఎస్టీ జాబితా నుండి వారిని తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, జూన్ 18: తెలంగాణ రాష్ట్రంలోని వలస లంబాడాలను ఎస్టీ జాబితానుండి తొలగించి, ఏజన్సీలోని 5, 6 షెడ్డ్యూల్డ్‌ల ప్రాధాన్యాన్ని పాలకులు, ప్రభుత్వం గుర్తించాలని తుడుందెబ్బ (ఆదివాసీ హక్కు ల పోరాట సమితి) రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబూరావు డిమాండ్ చేశారు. సోమవారం తుడుందెబ్బ ఆధ్వర్యంలో వై జంక్షన్‌నుండి తుడుందెబ్బ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తుడుందెబ్బ, ఏటిఎఫ్, ఏఎస్‌యు, ఆదివా సీ మహిళా సంఘం, ఆదివాసీ రైతుసంఘం నాయకులు స్ధానిక ఐటిడిఎ కార్యాలయాన్ని చేరుకుని ఐటిడిఎ పిఒ చక్రధర్‌రావుకు వినతి పత్రం అందజేశారు. అంతకుముందే తుడుందెబ్బ నాయకులు ఐటిడిఎ కార్యాలయా న్ని ముట్టడించేందుకు వస్తున్నారని తెలుసుకున్న ములుగు డిఎస్పీ రాఘవేందర్‌రెడ్డి ములుగు సిఐ సాయిరమణ, ఏటూరునాగారం సిఐ సత్యనానాయణల నేతృత్వంలో ఎస్సైలు శ్రీకాంత్, సాంబమూర్తి, వెంకటేశ్వరావులతో కలసి ఐటిడిఎ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు బాబూరావు, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌లు మాట్లాడుతూ షెడ్డ్యూల్డ్, నాన్ షెడ్డ్యూల్డ్ గ్రామాలలోని ఆదివాసీల సమస్యలపై పోరాటాలకు సిద్దంకావాలని పిలుపునిచ్చారు.