వరంగల్

సురేష్‌ను కోర్టులో హాజరుపరుచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్ టౌన్, జూన్ 18: న్యూడెమోక్రసీ దళ కమాండర్ సురేష్‌ను వెంటనే కోర్టులో హాజరుపరుచాని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సక్రు తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీపీఐ ఎంఎల్ మణూగురు, పినపాక దళ కమాండర్‌ను ప్రసాద్ అలియాస్ సురేష్‌ను కోర్టులో హాజరుపరుచాలన్నారు. ఆదివాసీలకు ఎంతగానో అండగా ఉంటే ఒర్వలే క ప్రభుత్వం దళాలపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. దానిలో భాగంగా ఆదివారం అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరెస్ట్ చేశా రు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నిరంకుశ పాలన కొనసాగిస్తుందన్నారు. ఈ సమావేశంలో పైండ్ల యాకయ్య, సరేష్, మనోహర్, పూల్‌సింగ్, శ్రీనివాస్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి
* రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి విజయారెడ్డి
కాటారం, జూన్ 18: పేద రెడ్డిలను ఆదుకునేందుకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి ఉడుముల విజయారెడ్డి కోరా రు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రెడ్డిల సంక్షేమానికై ఎన్నో ఉద్యమాలు చేపట్టినప్పటికీ తెలంగాణ సర్కారు నుంచి ఏలాంటి స్పందన లేదని, ఇందుకోసం తాము ముఖ్యమం త్రి ముందు డిమాండ్లను ప్రస్తావిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు, వెయ్యి కోట్ల రూపాయలతో రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయాలని అన్నారు. 50 ఏళ్లకు పైబడిన అన్ని కులాలకు చెందిన రైతులకు నెలకు 3వేల రూపాయలను పెన్షన్‌తో పాటు ఉచితంగా ఎరువులు, విత్తనా లు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. పలు డిమాండ్ల సాధనకు రాష్ట్ర సం ఘం పిలుపు మేరకు ఈనెల 19న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో ని సచివాలయం ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు. పెద్ద ఎత్తున రెడ్డి కులాస్థులు అధిక సంఖ్యలో తరలిరావాలని విజయారెడ్డి కోరారు.