వరంగల్

బందోబస్తుతో ఎస్సారెస్పీ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెక్కొండ, జూన్ 19: నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామ శివారునుంచి తోపనపల్లి వరకు కొత్తగా నిర్మిస్తున్న ఎస్సారెస్పీ కాలువ నిర్మాణ పనులను మంగళవారం పోలీసు బందోబస్తు నడుమ చేపట్టారు. ముప్పై ఏళ్లకిందట భూమిన కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిందని ప్రకటించిన ఎస్సారెస్పీ అధికారులు కాలువ నిర్మాణానికి పూనుకోగా బొల్లికొండ గ్రామ గిరిజన రైతులు కొద్ది రోజులుగా పనులు సాగకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నర్సంపేటీ ఏసీపీ సునీతమోహాన్ ఆధ్వర్యంలో నెక్కొండ సీఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్సై నవీన్ కుమార్, దుగ్గొండి,నల్లబెల్లి ఎస్సైలు, పలు పోలీసుస్టేషన్‌లకు చెందిన పోలీసులు, మహిళాకానిస్టేబుల్స్ ఎస్సారెస్పీ కాలువ నిర్మించేచోటికి బందోబస్తుకు చేరారు. తమ భూముల్లో కాలువను నిర్మించవద్దని ఆందోళన చేస్తున్న గిరిజన రైతులను కాలువ నిర్మించేచోటికి రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల పటిష్టబందోబస్తు నడుమ కాలువ నిర్మాణ పనులను పొక్లెయిన్‌లతో చేపట్టారు. పలువురు రైతులు లబోదిబోమంటూ తమగోడును పోలీసు అధికారులకు విన్నవించారు. ఎట్టకేలకు కాలువ నిర్మాణ పనులు పోలీసు పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీ అధికారుల విన్నపంమేరకు తగిన బందోబస్తును సమకూర్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.