వరంగల్

ఆర్థిక నేరాలకు పాల్పడితే పీడీ యాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, జూన్ 21: పోలీసు కమిషనరేట్ పరిధిలో బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఊరుకోవద్దని గురువారం కమీషనరేట్ కార్యాలయంలో జరిగిన నేరసమీక్షా సమావేశంలో సిపి డా.వి రవీందర్ పోలీసు అధికారులను కోరారు. అంతేకాకుండా రౌడీయిజానికి పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, బాధితులతో మర్యాదగా ప్రవర్థించాలని కోరారు. విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు వచ్చే వ్యక్తుల సమస్యలు తెలుసుకుని వెంటనే విచారణ పూర్తిచేసి తిరిగి పంపించాలని అన్నారు. పోలీసు స్టేషన్‌ను సందర్శించే అధికారులు సదరు పిఎస్‌కు వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి తీసుకున్న చర్యలు, ఫిర్యాదు దారులకు ఫోన్‌చేసి చెప్పడం, స్పందించిన తీరుపై అడిగి తెలుసుకోవాలని కోరారు. ఇటీవల జారీచేసిన బదిలీ ఉత్తర్వుల్లో బదిలీ అయిన కానిస్టేబుళ్లను తక్షణమే రిలీవ్ చేయాలని అన్నారు. శాంతి భద్రతలకు సంబంధించి ఆస్తి నేరాలకు పాల్పడే నేరస్థులపై పిడి యాక్టు అమలయ్యే విధంగా అధికారులు కేసులు నమోదు చేయాలని తెలిపారు. పోలీసు స్టేషన్ పరిధిలోని రౌడీలకు సంబంధించిన పూర్తి సమాచారానిన సేకరించడంతో పాటు వారి వ్యక్తిగత స్థితిగతులపై నిఘా పెట్టాలని కోరారు.
ప్రతి రైతును ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం
భీమదేవరపల్లి, జూన్ 21: ప్రతి రైతును ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని భీమదేవరపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు సయ్యద్ ఖాజా శరీఫోద్దిన్ పేర్కొన్నారు. భీమదేవరపల్లి మండల గ్రామపంచాయితీ కార్యాలయంలో గురువారం రైతు బీమా పధకంను సర్పంచ్ శరీఫోద్దిన్ ప్రారంభోత్సం చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిస సమావేశంలో శరీఫోద్దిన్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కొరకు రైతు బంధు పధకంతో ప్రతి రైతును ఆదుకుంటుందన్నారు. 18 సంవత్సరాల వయస్సు నుండి 59 సంవత్సరాల వయసు కల్గిని రైతును బీమా పధకంలో చేర్చుకోవాలన్నారు.