వరంగల్

అభివృద్ధిలో ముందుకెళ్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండాల, జూన్ 21: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తుందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్, ఆలేరు నియోజక వర్గ ఎమ్మెల్యే గొంగిడి సునతమహేందర్‌రెడ్డిలు అన్నారు. గురువారం మండలంలోని తుర్కలషాపురం గ్రామంలో రూ. 16లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం, రూ. 25లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, గంగాపురం గ్రామంలో రూ. 16లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయం, రూ. 7లక్షల 50వేలతో నిర్మించిన మహిళ సమాఖ్య సమావేశ భవనాలను వారు ప్రారంభించారు. అనంతరం నిర్వహించినసమావేశంలో వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 60సంవత్సరాలు దాటినా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని తెలంగాణలో అనేక కష్ట, నష్టాలకు ఓర్చి బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా చేసేలా ముఖ్యమంత్రి కేసిఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఆనాడు రాష్ట్రం విడిపోతే తెలంగాణ అందాకారం అవుతుందన్నవారి కండ్లు చెమ్మరిళ్లేలా తెలంగాణలో 24గంటల నాణ్యమైన కరెంటును, రైతులకు, కంపెనీలకు, ప్రజలకు అందిస్తున్నారన్నారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ యాదవులకు గొర్రెలను, బెస్త, ముదిరాజ్‌లకు చేపల పెంపకం అందిస్తున్నారని, రైతులే రాజులుగా ఎదగాలన్న సంకల్పంతో మిషన్ కాకతీయ ద్వారా గ్రామంలోని చెరువుల పూడికతీత మొదలుపెట్టి పంట సాయం అందిస్తున్నాడని అన్నారు. దేవాదుల, గంధమల్ల ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి త్వరలో సాగునీరు అందిస్తున్నామని అన్నారు. అనంతరం గంగాపురం గ్రామంలో మూడెకరాల వ్యవసాయ భూమి దళితులకు ప్రభుత్వం అందించిన వారికి పంట పెట్టుబడి సహాయం క్రింద 16మంది లబ్దిదారులకు రూ. 4,83,500 విలువ గల చెక్కులను జనగామ వ్యవాసయ శాఖ వారి ఆధ్వర్యంలో అందచేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, ఎంపీపీ సంఘి వేణుగోపాల్, సర్పంచ్‌లు పురుగుల మల్లేశ్, గార్లపాటి శ్రీలత, జేడీఏ వీరునాయక్, ఏడీఏ రాధిక, ఎంఆర్‌వో స్వప్న, ఎంపీడీవో పుష్పలీల, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బండ రమేశ్‌రెడ్డి, రైతు సమన్వయ కమిటి మండల కన్వీనర్ గడ్డమీది పాండరీ, గార్లపాటి సోమిరెడ్డి, చిన్నం ప్రకాష్‌లు పాల్గొన్నారు.