వరంగల్

మానుకోటలో ఘనంగా యోగా‘డే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూన్ 21: తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసే సాధనమే యోగా అని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం ఆయూష్, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్తానిక యన్‌టిఆర్ స్టేడియంలో నారాయణ ప్రకాస్ లోయ శిక్షణ లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్య ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యోగా ను ప్రతి ఒక్కరు అనుసరించాలని, యోగా వల్ల జరిగే లాభాలను విశ్వవ్యాప్తం చేయుటకే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. పనిభారం, మానసిక ఒత్తిళ్ల వల్ల మనిషి అనారోగ్యాల పాలు అవుతున్నారని మనదేశంలో పురాతనకాలము నుండే యోగాకు మంచి గుర్తింపు ఉందని అన్నారు. ఆయుర్వేదం, యునామి, హోమియో, నాచరోపతి లాంటి వైద్యాలు ప్రకృతిలో భాగమైనవన్నారు. మన సాంప్రదాయాలు, విధానాలు ప్రపంచమే అనుసరిస్తుందని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాదించవచ్చన్నారు. చిన్నారులకు విద్యార్థి దశ నుండే యోగాబ్యాసం అలవరిస్తే ఆరోగ్యవంతమైన సమాజం ఆవిర్భవిస్తుందని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరు యోగాను దినచర్యగా మార్చుకొని ఆరోగ్యవంతమైన జీవితాలను అనుభవించాలని ఒత్తిడికి విముక్తి మార్గం యోగా అని కలెక్టర్ తెలిపారు.