వరంగల్

ప్రొటోకాల్ కోసమే వారిద్దరి తపన..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, జూన్ 23: నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, అధికార పార్టీ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డిలు పూర్తిగా విస్మరించి ప్రొటోకాల్ కోసం పోటీపడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెలే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ హయాం లో జరిగిన అభివృద్ధే తప్ప కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని స్పష్టం చేశారు. పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నర్సంపేట పట్టణంలోని 14 వార్డు శాంతినగర్‌లో శనివారం రేవూరి ప్రకాశ్‌రెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా శాంతినగర్‌లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా రేవూరి మాట్లాడుతూ తన హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధే కనిపిస్తోందే తప్ప మరోటి కనిపించ డం లేదన్నారు. ఎమ్మెల్యే పదవిని నియోజకవర్గ ప్రజల కోసం కాకుండా దొంతి మాధవరెడ్డి తన స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ధ్వ జమెత్తారు. ఎమ్మెల్యే కాజేసిన ప్రజాధనాన్ని రికవరి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దొంతి అవినీతికి చెక్ పెట్టకుండా పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎందుకు వౌనంగా ఉంటున్నారని, వౌనం వెనుక ఉన్న మతల బు ఏంటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫ లం చెందిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిన ఈ ఇద్దరి పనితీరుపై ప్రజలంతా చర్చించి ఆలోచించాలని కోరారు. ప్రజాక్షేమం కాంక్షిం చే నాయకుడికే వచ్చే ఎన్నికలలో ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈకార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎర్ర యాకూబ్‌రెడ్డి, అజ్మీరా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు వేముల బొందయ్యగౌడ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటోతు సంతోష్‌నాయక్, నాయకులు సంప త్, రవీందర్, చిలువేరు కుమారస్వామి, రావుల అఖిల్, నరేందర్‌రెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.