వరంగల్

వచ్చే 30 ఏళ్లకు ఓరుగల్లు అభివృద్ధికి ‘కుడా’ మాస్టర్ ప్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 23: రాబోయే 30 ఏళ్ల పాటు వరంగల్ నగరాన్ని అభివృద్ధిపై ‘కుడా’ మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్ధ చైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్నారు. శనివారం ‘కుడా’ సమావేశమందిరం లో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ‘కుడా’ మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నా రు. ‘కుడా’ పరిధిలోగల సీనియర్ సిటిజన్స్‌లతో సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ వివరాలపై శిక్షణా తరగతులు ద్వారా అవగాహన చేయడం జరిగిందని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో 58 డివిజన్లకు గాను, డివిజన్ల వారిగా మ్యాప్‌లను తయారు చేసి ప్రజల ముందు ఉంచడం జరుగుతుందని అన్నారు. ఇందు కోసం డ్వాక్ర గ్రూపు మహిళలచే పంపి ణీ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. ‘కుడా’ వైస్ చైర్మన్, మన్సిపల్ కమిషనర్ గౌతమ్ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ పరిధిలో ఇం డస్ట్రీయల్ పార్కులు, రోడ్ల ఏర్పాటు, కమర్షల్ కాంప్లెక్స్‌లు, ల్యాండ్ యూజ్ రోడ్స్ మొదలైన వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఇంజనీర్లు విద్యాసాగర్, వెంకట్రాం నర్సయ్య, శ్రీనివాస్, కూడా ప్లానింగ్ ఆఫీసర్ అజిత్‌రెడ్డి, ఆర్ అండ్ బీ నేషనల్ హైవే, ఇంజనీరింగ్ అధికారులతో పాటు స్మార్ట్ సిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగాన్ని విస్మరిస్తే.. పతనం తప్పదు
* ‘దోస్త్’లో 3వ విడత అవకాశం ఇవ్వాలి * ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి
నక్కలగుట్ట, జూన్ 23: విద్యారంగాన్ని విస్మరించిన ఏ ప్రభుత్వాలు మనుగడలో కొనసాగిన దాఖలాలు లేవని భార త విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాదం తిరుపతి అన్నారు. శనివారం హన్మకొండలోని సుందరయ్యభవన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రైవేట్, కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల మూసివేతకు ఏర్పరచిన 1, 42, 91 జీవోలను ప్రైవేట్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం ఉదాసీనవైఖరితో వారికి సహాయ, సహకారాలు అందించడం దారుణమని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి కొనసాగుతున్న ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలను ప్రభుత్వం ఎందుకు మూసి వేయడం లేదని ప్రశ్నించారు. అదే విధంగా డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ ద్వారా విద్యార్థులకు మూడవ విడతలో ప్రవేశాలు కల్పించాలని, పాలిటెక్నిక్ విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లలలో అవకాశాలను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు సంతోష్, రాజేష్, హరీష్, అనిల్, పవన్, ప్రసాద్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.