వరంగల్

పోడు రైతులపై ఫారెస్టు దాడులు ఆపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, జూన్ 23: ఏజన్సీ ప్రాంతంలోని పోడు రైతులపై ఫారెస్టు అధికారులు దాడులు ఆపాలని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క (దనసరి అనసూయ) అన్నారు. శనివారం మండల కేంద్రంతోపాటు, కన్నాయిగూడెం మండలంలోని ఆయా గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఏజన్సీ ప్రాంతంలో పోడు భూముల్లో రైతులు సాగు చేయకుండా ఫారెస్టు అధికారులు రైతులపై భౌతిక దాడులు చేయడం ఆపాలన్నారు. లేని పక్షంలో ప్రజలతో మమేకమై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు చిటమట రఘు, ఇర్సవడ్ల వెంకన్న, రాంబాబు, అబ్బు రమేష్, తాళ్లపల్లి నరేందర్, జాడి రాంబాబులతోపాటు 100మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

27న రూరల్ జిల్లా ఛలో కలెక్టరేట్: బీఎల్‌ఎఫ్
నర్సంపేట, జూన్ 23: తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడే కష్టజీవుల కడగండ్లు పరిష్కారం అవుతాయని బీఎల్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు గాదగోని రవి, చుక్కయ్యలు అన్నారు. నర్సంపేటలోని ఓంకార్ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల వాగ్ధానాలు అమలు చేయాలని ఈనెల 27న రూరల్ జిల్లా కలెక్టరేట్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. చలో కలెక్టరేట్‌కు వేలాది గా తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈసమావేశంలో బీఎల్‌ఎఫ్ నాయకులు కన్నం వెంకన్న, నాగెల్లి కొమురయ్య, భూక్య సమ్మయ్య, బుర్రి ఆంజనేయులు, వంగాల రాగసుధ, ఈదునూరి వెంకన్న, ఈర్ల రవి, మేకల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.