వరంగల్

పీజీసెట్ అడ్మిషన్ల పరిశీలన పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేయూ క్యాంపస్, జూలై 15: కేయూ పీజీ సెట్ 2018 మొదటి విడత అడ్మిషన్లకై సర్ట్ఫికెట్ల పరిశీలనను ఈనెల 16,17 తేదిలలో నిర్వహించనున్నట్లు కేయు అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కేయు పీజీ సెట్ 2018లో 30పైన ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల వచ్చిన విద్యార్ధులు 16,17 తేదీలలో పరిశీలనకు సర్ట్ఫీకెట్లతో హాజరుకవచ్చునని ఒక ప్రకటనలో తెలిపారు.

హామీలను అమలులో సర్కార్ విఫలం
*అంబటి శ్రీనివాస్
నర్సంపేట, జూలై 15: ప్రజా స్వా మిక తెలంగాణ సాధనే తెలంగాణ జన సమితి ధ్యేయమని ఆపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లిలో ఆదివారం ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. జన సమితి నాయకులు ఇంటి ఇంటి కి వెళ్లి టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈసందర్భంగా అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజల ఆకాంక్షలు నేరవేరతాయని అందరూ భావించారని, అయితే కేసీఆర్ ప్రభు త్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తుంది కేసీఆర్ కుటుంబ పాలన మాత్రమేనని విమర్శించారు. ఎన్నికల ముందు తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్‌ఎస్ సర్కార్ పూర్తిగా విఫలం అయిందని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఆచరణలో అమలు కావడం లేదన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల్లో కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలంతా బుద్ది చెప్పాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జన సమితి నాయకులు బొట్ల పవన్, పొలబోయిన లక్ష్మయ్య, అంబటి వంశీ, బొనగాని రవీందర్, షేక్ జావీద్, గంగిడి సాంబిరెడ్డి, కళాకారులు బుల్లెట్ వెంకన్న, పెరుమాండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.