వరంగల్

అణిచివేస్తే ఉద్యమాలు ఆగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూలై 15: అణిచివేతలతో ఉద్యమాలను అడ్డుకొలేరని, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గుర్తించాలని అఖిలపక్షం కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. మానుకోటలో ఆదివారం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక మధర్‌థెరిస్సా సెంటర్‌లో ఆదివారం దగ్ధంచేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ నాయకులు మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతో తెలంగాణ రాష్టస్రమితి అధికారంలో లేనప్పుడు చేసిన ఉద్యమాలను గద్దెనెక్కగానే మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతో రహదారుల దిగ్భందన కార్యక్రమాన్ని చేపడితే ప్రభుత్వం నిర్భందంగా అణిచివేతలకు దిగిందని, విద్రోహశక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా వివిధ పోలీస్ స్టేషన్‌లకు బలవంతంగా తరలించారని విమర్శించారు. ఈ చర్యను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధంచేస్తున్నట్లు తెలిపారు. బయ్యారం ఉక్కుపరిశ్రమ సాధన డిమాండ్‌తో ఈ నెల 18న మహబూబాబాద్ జిల్లా బంద్ పిలుపునివ్వడం జరిగిందని మనప్రాంత అభివృద్ధికి పునాదిరాయి వంటి బయ్యారం ఉక్కు సాధన కోసం భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు జిల్లా బంద్‌లో కలసి రావాలని అఖిలపక్ష కమిటీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెజనసమితి జిల్లా సమన్వయకర్త డాక్టర్ డోలి సత్యనారాయణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బి. అజయ్, జెడ్పిటీసీ మూలగుండ్ల వెంకన్న, మున్సిపల్ వైస్‌చైర్మన్ సూర్నపు సోమయ్య, జెడ్పిటిసీ మూలగుండ్ల వెంకన్న, టీడీపీ నాయకులు భూక్య సునిత, బీసీ సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షులు శంతన్‌రామరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి రాంచందర్‌రావు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దార్ల శివరాజ్‌లతోపాటు వివిధ రాజకీయ పక్షాల నాయకులు ప్రసాద్‌నాయక్, రాజుగౌడ్, రజాక్, బీరవల్లి రవి, పిల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యా వలంటీర్లకు దరఖాస్తుల ఆహ్వానం
కాటారం, జూలై 15: విద్యా వాలంటీర్ల పోస్టుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కాటారం మండల విద్యాధికారి యం విజయ్‌మోహ న్ తెలిపారు. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 2018-2019 విద్యా సంవత్సరానికి కాటారం, మహాముత్తారం మండలాల్లో ఖాళీగా నున్న ఉపాధ్యాయుల పోస్టులలో విద్యా వాలంటీర్ల పోస్టుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మహాముత్తారం మండల ఇన్‌చార్జి విద్యాధికారి ఎం.విజయ్‌మోహన్ తెలిపారు. అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దరఖాస్తులను సీడీఎస్‌ఈ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్‌సైట్లో అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక కాపీని సంబంధిత జిరాక్స్ ప్రతులపై గెజిటెడ్ అధికారిచే సంతకం చేయించి, మండల విద్యా వనరుల కేంద్రంలో ఈనెల 16లోగా సమర్పించాలని విజయ్‌మోహన్ సూచించారు.