వరంగల్

నిండు కుండలా లక్నవరం చెరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావుపేట, జూలై 15: అన్నదాతలకు కల్పతరువైన లక్నవరం చెరువునిండు కుండను తలపిస్తుంది. నీరు ఎండిపోయి కుంటలా మారి న లక్నవరం చెరువు కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆదివారం సాయంత్రానికి 23.5 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. కాకతీయులు వారి నైపుణ్యంతో నిర్మించిన లక్నవరం చెరువు రెండు మండలాల ప్రజలకు కల్పతరువు. 32.5 అడుగుల నీటి సామర్యం ఉన్న లక్నవరం చెఱువు నీటితో అధికారికంగా 8700 ఎకరాలు సాగవుతుండగా అనధికారికంగా 12వేల ఎకరాలకు పైగానే సాగవుతుంది. వీటన్నింటికి లక్నవరం ప్రధాన కాలువల ద్వారానే సాగునీరు అందుతుంది. అయితే ఇప్పటికే అన్నదాతలు వరినారు పోసి నాట్లు వేసేందుకు అదను కోసం ఎదురు చూస్తుండగా లక్నవరం చెరువులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఖరీఫ్ పంటకు ఇక డోకా ఉండబోదనే ధీమా అన్నదాతలలో కనిపిస్తుంది. లక్నవరం పూర్తి సామర్యంతో నిండితో ఖరీఫ్‌తోపాటు రబీ పంటలకు సాగునీటిశాఖ అధికారులు అనుమతి ఇస్తారు. దీంతో లక్నవరం చెరువు పూర్తిస్థాయిలో నిండాలని అన్నదాతలు కోరుకుంటున్నారు.

గ్రామాల్లో చినుకు పడితే చిత్తడే
నల్లబెల్లి, జూలై 15: దేశానికి పల్లేలే పట్టుకోమ్మలని చెపుకునే నాయకులకు పల్లెలోని అంతర్గత రోడ్లు దుస్థితి కానరావడం లేదా అంటూ పలు గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నల్లబెల్లి మండలంలోని 28 గ్రామా పంచాయతీలుండగా 15 శివారు పల్లెలున్నాయి. ఐతే ఇందులో ఎక్కువ శాతం మట్టిరోడ్లు మాత్రమే ఉన్నాయి. ఏ కొద్దిపాటి వర్షం పడిన చిత్తడిగా మారుతున్నాయి. మండల కేంద్రమైన నల్లబెల్లితో పాటు పలు గ్రామాల్లోని ఇదే దుస్ధితి. సైడు కాలువలు లేకపోవడంతో పాటు వేసవిలో కొంద రు సర్పంచులు మేటల్ రోడ్లపై నాసీరకం మొరం పోయడంతో రోడ్లన్ని బురదమయంగా మారి చిన్నారులు పాదచారులు సర్కస్‌ఫీట్లు చేస్తు వెల్లుతున్నారు. మూడుచెక్కలపల్లి, గుండ్లహాపాడ్, నారక్కపేట గ్రామాల్లో మహిళలు రోడ్లపై వరినాట్లు వేస్తూ నిరసన తెలుపుతున్నారు. గుండ్లపహాడ్ గ్రామంలో చాలా వరకు మట్టి రోడ్లు కావడంతో వర్షం దాటికి నారు మడులను తలపిస్తున్నాయి. దీంతో గ్రామస్థులు రోడ్డుమీద నాటు వేస్తు నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి గ్రామాల్లోని అంతర్గత రోడ్లును సీసీ రోడ్లును వేయాలని కోరారు.

పేద పిల్లలంటే ఇంత అలుసా?
* గురుకుల పాఠశాల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే
కేసముద్రం, జూలై 15: పేద పిల్లలంటే ఇంత అలుసా.. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుంటే.. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశా ల నిర్వాహాణ తీరుపై మండిపడ్డారు. ఆదివారం ఎమ్మెల్యే గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సమయం లో విద్యార్థినులు అల్పాహారం తిం టుండగా నేరుగా డైనింగ్ హాల్‌కు వెళ్లిన ఎమ్మెల్యే వారితో పాటు తనకు టిఫిన్ పెట్టమని పురమాయించారు. దీనితో ఎమ్మెల్యేకు సైతం సిబ్బంది అల్పాహారంగా రొట్టెలు, పప్పు వడ్డించారు. అయితే పప్పులో తాలింపు లేదని, రొట్టెలు గోదుమపిండికి బదులుగా మైదాపిండితో చేసినట్లు గుర్తించిన ఎమ్మెల్యే సిబ్బం ది, నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాలింపులేకుండా రుచీపచీ లేని పప్పు, గోదుమ పిం డికి బదులుగా మైదాపిండితో చేసిన రొట్టెలు తింటే విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అలాగే హాస్టల్‌లో పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉండటాన్ని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే.. మీరు ఇలా ప్రవర్తిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెవడం సరికాదన్నారు. ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకొం డి మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతం అయితే సహించేదిలేదన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.