వరంగల్

సొసైటీల్లో అవకాశం కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, జూలై 15: 18 ఏళ్లు పూరె్తైన ముదిరాజ్ యువకులందరికీ మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల్లో సభ్యత్వం కల్పించే విధం గా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముదిరాజ్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు వినతిపత్రం అం దచేశారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీను ఆధ్వర్యంలో వివిధ జిల్లాల యువత అధ్యక్షులతో పాటు మరికొంత మంది రాష్ట్ర నాయకులు హైదరాబాద్ శామీర్‌పేటలో మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం రాజ్యసభ సభ్యునిగా పదవి బాధ్యతలు స్వీకరించి 100రోజులు పూరె్తైన సందర్భంగా డా. బండ ప్రకాష్‌ముదిరాజ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపామని వివరించారు. ఈ కార్యక్రమంలో జనగామ ప్రాంతానికి చెందిన పలువురు ముదిరాజ్ యువకులతో పాటు వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారని తెలిపారు.
23న మానుకోటకు కోదండరాం
* టీజేఎస్ జిల్లా సమన్వయకర్త డోలి సత్యనారాయణ
మహబూబాబాద్, జూలై 15: రైతులు సమస్యలపై మరోమారు ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం 23వ తేదీన తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో రైతుదీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీజెఎస్ జిల్లా సమన్వ య కర్త డాక్టర్ డోలి సత్యనారాయణ అన్నారు. మానుకోటలో ఆదివారం రైతుదీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డోలి సత్యనారాయణ మాట్లాడుతూ.. పోడు, కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని, భూ రికార్డులలో దొర్లిన తప్పులను వెంటనే సరిదిద్దాలని రికార్డుల్లో తప్పు ల మూలంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్‌లతో ఈ దీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కొదండరాం ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టరేట్ ముందు జరిగే ఈ దీక్షా కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా రైతులు భారీగా తరలిరావాలని కోరారు. పోరాడితే తప్పా సమస్యలు పరిస్కారమయ్యే పరిస్థితి కనిపించడంలేదని, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రభుత్వాలకు తెలిపేందుకు ఈ దీక్షకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజెఎస్ నాయకులు పిల్లి సుధాకర్, మాలోతు వెంకన్న, వంగ రమేష్, భూక్య సత్యనారాయణ, మనోజ్, హరి, నలమాస సాయి, మంద శశి, చిత్తారి సోమన్న తదితరులు పాల్గొన్నారు.