వరంగల్

నువ్వా.. నేనా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జూలై 17: పరకాల మున్సిపల్ రాజకీయం రసకందాయంలో పడింది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తు పరకాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం కైవసం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలతో రాజకీయ సమీకరణలు నువ్వా..నేనా..! అన్నట్లు మారుతున్నాయి. వూహ్యప్రతి వ్యూహాలతో రోజు రోజుకు మారుతున్న సమీకరణలు ఇప్పుడు పరకాలలో హాట్‌హాట్ టాఫీక్‌గా మారింది. చైర్‌పర్సన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోవడానికి ఇనగాల ప్రత్యేక దృష్టి సారించి కాంగ్రెస్ పార్టీ విప్ జారీకి సన్నాహాలు చేస్తుండమే కాకుం డా న్యాయ నిపుణులతో చర్చిస్తుండగా అవిశ్వాసం నెగ్గాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రయత్నాలు చేస్తుండడంతో రాజకీయ వాతావరణం వేడేక్కింది. దీనిపై ఈనెల 26న ప్రత్యేక సమావేశం జరగనుంది. మున్సిపల్ చైర్‌పర్సన్ అవిశ్వాసం ఇప్పుడు పార్టీల రాష్ట్ర అధ్యక్షుల వద్దకు చేరింది.
* వ్యూహ ప్రతివ్యూహలతో...
పరకాల మున్సిపల్ చైర్‌పర్సన్‌పై జరిగే అవిశ్వాసంపై పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిల వ్యూహప్రతివూహలతో పరకాలలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఇనగాల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తు తన మద్దతుదారులను క్యాంపుకు తరలించగా ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు. ఈనేపథ్యంలో ఇద్దరు కౌన్సిలర్లు టచ్‌లోకి రావడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. తెరాస శిబిరం నుంచి ఇద్దరు కౌన్సిలర్లు బయటకు రావడం మళ్లీ శిబిరానికి వెళ్లడం కలంకలం రేపింది. ఇప్పటికే ఇనగాల, ఎమ్మెల్యే ధర్మారెడ్డి వేరు వేరుగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. అవిశ్వాసం వీగిపోవడానికి ఇనగాలకు ఒకరి మద్దతు అవసరం. భాజపాకు చెందిన ఓ సభ్యుడిని రప్పించడానికి ముఖ్య నేతలు మంతనాలు చేస్తు పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, వైస్ చైర్‌పర్సన్‌ను మళ్లీ మనమే దక్కించుకోవడానికైనా శిబిరం నుండి రావా లని నేతలు ఒత్తిడి చేస్తున్నారు. అయితే చైర్‌పర్సన్ రాజభద్రయ్య కొందరు కౌన్సిలర్లు ఎన్నికల సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చారనే దానిపై సమాచారం సేకరించి ఇనగాల దృష్టికి తీసుక వచ్చినట్లు సమాచారం. తప్పుడు సమాచారం ఇచ్చిన కౌన్సిలర్లపై చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై న్యాయ నిపుణులతో చర్చిం చి వారిని ఓటింగ్‌లో పాల్గొనకుండా అనర్హత వేటు వేసే విధంగా దృష్టి సారించడంతో ఉత్కంఠ రేపుతుంది.
చల్లాకు విప్ జారీ చేయాలంటూ ..
పరకాల మున్సిపల్ చైర్‌పర్సన్‌పై జరిగే అవిశ్వాసంపై జరిగే ఓటింగ్‌లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఓటు వేయకుండా విప్ జారీ చేయాలంటూ టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్నోజు శ్రీనివాసాచారి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణకు వినతిపత్రం అందచేశారు. అదికాకాకుండా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లకు విప్ జారీకి సిద్దం అవుతూ అవిశ్వాసం వీగి పోవడానికి ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఎమ్మెల్యే ధర్మారెడ్డి గత మేయర్ ఎన్నికల సందర్భంగా కో ఆప్షన్ ఎన్నికలో లేటర్ ఇవ్వడంపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఓటు హక్కు వినియోగంపై ఆర్‌టిఐ క్రింద సమాచారం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు సిద్దం కావడంతో పరకాల మున్సిపల్‌పై జరిగే రాజకీయ సమీకరణలు రోజుకో మలుపు తిరుగుతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి పరకాల మున్సిపల్ పీఠంపై నెలకొంది.