వరంగల్

ఆ ఇద్దరు నర్సంపేటకు చేసిందేమి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, ఆగస్టు 10: నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సత్తా తనకే సాధ్యమని, సెంటిమెంట్‌తో పెద్ది, సానుభూతితో గెలిచిన ఎమ్మెల్యే దొంతిలు నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమి లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, నర్సంపేట మాజీ ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. నర్సంపేట నియోజకవర్గంలో ని శివాజీనగర్‌కు చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మాలగాని రామారావు శుక్రవారం రేవూరి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రేవూరి మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో బాగుపడ్దది కేవలం సీఎం కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు మాత్రమేనని.. ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఆతర్వాత అమలు చేయలేదన్నారు. మావల్లే బంగారు తెలంగాణ సాధ్యమని చెప్పి న కేసీఆర్ మాటలు నమ్మి ప్రజలు వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరి అధికారాన్ని అప్పగించారని, అయితే అధికారంలోకి వచ్చాక వారి నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా గత నాలుగేళ్ల పాలన నడిచిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ మాయమాటలకు ఆకర్షితులై అనేక మంది ఆపార్టీలో చేరినా నేడు ఆపార్టీ నిజస్వరూపాన్ని, నయవంచనను చూసి పార్టీని వీడుతున్నారని చెప్పారు. ఇతర పార్టీలకు వెళ్లిన వారు టీడీపీలో చేరేందుకు ఉత్సా హాం చూపిస్తున్నారని, వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ఈకార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కో ఆర్డీనేటర్ జాటోతు సంతోష్‌నాయక్, చుక్క రమేష్, బూర్గు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

సామాజిక సేవలో రెడ్‌క్రాస్ ముందంజ
* విశిష్ట సేవలకుగాను ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు అవార్డులను అందజేసిన గవర్నర్ నరసింహన్
వరంగల్, ఆగస్టు 10: వరంగల్ రెడ్ క్రాస్ సంస్థ సామాజిక సేవలో ముం దంజలో ఉందని, తెలంగాణ రెడ్‌క్రాస్ సోసెటీ సేవలు అమోఘమని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. 2014-2018 వరకు ఉత్తమ సేవలు అందిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాను రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిపినందుకుగాను ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లకు, రెడ్‌క్రాస్ సంస్ధ బ్లడ్‌బ్యాంక్ సంస్థ పాలకవర్గానికి రాష్టస్థ్రాయిలో అవార్డులు ప్రకటించింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ రాజ్‌భవన్‌లోని సంస్కృతిక హాల్లో నిర్వహించిన వార్షిక సమావేశంలో గవర్నర్ చేతుల మీదుగా సేవ అవార్డులను కలెక్టర్లు స్వీకరించారు. వరంగల్ జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ, వందేమాతరం ఫౌండేషన్ ద్వారా పేదలకు జనరిక్ మందుల షాపులను జిల్లా వ్యాప్తంగా ఏర్పా టు చేసి కేంద్ర ప్రభుత్వం జన ఔషదీ ప్రశంసలను ఆనాడు ఉమ్మడి జిల్లా కలెక్టర్‌గా ఉన్న వాకటి కరుణ అందుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ 155 ఏండ్ల చరిత్రలో స్వచ్చంద సేవ, ప్రపంచీకరణను, ఐక్యత, నిష్పక్షపాతం, మానవత్వం, ప్రాథమిక విలువలు అనుసరిస్తుందని అన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకటి కరుణ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సంస్థ తలసేమియ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం అందించడం అభినందనీయం అని అన్నారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, రూరల్ కలెక్టర్ హరిత మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సంస్థకు మరింత సహకారం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జనగామ కలెక్టర్ వినయ్‌కృష్ణరెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధులు, పాలక వర్గ సభ్యులు, వివిధ జిల్లాల రెడ్‌క్రాస్ చైర్మన్లు పాల్గొన్నారు.