వరంగల్

తెలంగాణలో అన్నదాతలు ఆత్మగౌరవంతో బతకాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, ఆగస్టు 10: ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడి జీవనం సాగించిన అన్నదాతలు ప్రత్యేక తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నా రు. జనగామ మండలం పెంబర్తి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన హరితహారం, రైతుబీమా బాండ్ల పంపిణీ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం కడియంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. హరితహారంలో భాగంగా గ్రామంలో వారు మొక్కలు నాటి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షత వహించగా అతిథులు రైతులకు రైతుబీమా బాండ్లను అందచేశారు. అనంతరం డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న అనంతరం రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ వాస్తవాన్ని దేశం గుర్తించిందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణకు విద్యుత్ నిలిచిపోయి చీకటిమయమవుతుందని మాట్లాడిన వారి కళ్ళు మిరిమిళ్ళుగొలిపే విధంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. 15రోజుల్లో పెంబర్తి చెరువులోకి దేవాదుల నీరు తెప్పిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 18 నుండి రైతులకు 2వ విడత ముందస్తు పెట్టుబడుల చెక్కులను పంపిణీ చేసేందుకు కావాల్సిన నిధులు విడుదలకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. ప్రతి రైతుకు రూ. 2271చొప్పున మొత్తం రూ. 636కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీ సంస్థకు చెల్లించిందని అన్నారు. ఆగస్టు 14 రాత్రి నుండే రైతు భీమా పత్రాలు అమలులోకి వస్తాయని తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు మాట్లాడుతూ జనగామ జిల్లా అభివృద్ధికోసం ప్రత్యేక తోడ్పాటునందస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వినర్ ఇర్రి రమణారెడ్డి, డీసీపీ మల్లారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వీరునాయక్, మున్సిపల్, మార్కెట్ చైర్‌పర్సన్‌లు ప్రేమలతారెడ్డి, పద్మయాదగిరిరెడ్డి, ఎంపీపీలు యాదగిరి, అనిత, జెడ్పీటీసీ విజయ, ఎంపీటీసీ కావ్యశ్రీ, రైతు సమన్వయ కమిటి మండల కో-ఆర్డినేటర్ పాల్గొన్నారు.