వరంగల్

పరకాల మున్సిపల్ సమావేశం.. గరం.. గరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, ఆగస్టు 10: పరకాల మున్సిపల్ సాధారణ సర్వ సభ్య సమావేశం గరం గరంగా సాగిం ది. శుక్రవారం పరకాల మున్సిపల్ చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి కమిషనర్ జోనా, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం సమావేశం నిర్వహణ కొనసాగుతుండగా జెన్‌కో నుండి విడుదలైన నిధుల మద్య టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఒక వైపు, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోవడమే కాకుండా వారి మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య సభ్యులకు నచ్చచ్పెడానికి ప్రయత్నించి న ఎవరికి వారే వారు మాట్లాడుతుండడంతో సమావేశం రసభాసగా మారింది. కౌన్సిలర్ పంచగిరి.. జయమ్మపై చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా మం డిపడింది. తాను కాంగ్రెస్ బిఫాంపై పోటీ చేసి గెలిచానని చెప్పారు. తనపై ఆరోపణలు చేసే వారు ముందు వారి గురించి ఆలోచించుకొని తనపై ఆరోపణలు చేయాలని చెప్పారు. పార్టీ గుర్తుపై గెలిచి పార్టీకి ద్రోహం చేసిన వారు తనను విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఎవరైన తప్పుడు కూతలు కూస్తే ఊరుకోనని తెలిపారు. అనంతరం జెన్‌కో నుండి విడుదలైన నిధులు కేవలం 8 మంది వార్డులో ఎలా కేటాయిస్తారని టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌తో వాగ్వివాదానికి దిగారు. ఓటింగ్ పెట్టాలని పట్టు పడ్డారు. గత సమావేశంలో ప్రతి వార్డుకు 5 లక్షలు కేటాయించాలని చేసిన తీర్మాణం కాదని ఇప్పుడు ఎలా నిధులు కేటాయిస్తారని ప్రశ్నించారు. కలెక్టర్ దృష్టి కి తీసుకవెళ్లుతామన్నారు. దీంతో కాంగ్రెస్, వైస్ చైర్మన్ రమ్యక్రిష్ణలు మాట్లాడుతూ 4 ఏళ్ల కాలంలో ఓటింగ్ పెట్టాలని సమావేశాల్లో ఎందుకు అనలేదని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చైర్‌పర్సన్ రాజభద్రయ్య మాట్లాడుతూ తనపై ఆరోపణలు చేస్తున్న వారి వార్డులకు రూ. 20లక్షల వరకు నిధులు కేటాయించినప్పుడు అప్పు డు లేని తప్పు ఇప్పుడు తప్పు అయిందా అని కౌన్సిలర్లను ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని పరకా ల పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేవునూరి రమ్యక్రిష్ణ, టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్
మంగపేట, ఆగష్టు 10: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంగపేట మండలం కమలాపురంకు చెందిన సిద్దంశెట్టి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఇటీవల జరిగి న తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ జిల్లాలో నియమించిన కమిటీలో మంగపేట మండలానిక సముచిత స్థానం లభించినట్లు సిద్దంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మండలానికి చెందిన సిద్దంశెట్టి లక్ష్మణరావు జిల్లా ఉపాధ్యక్షులుగా, సిద్దంశెట్టి కనకారావు, పడమటింటి సత్యనారాయణ, పొట్టి సుబ్బారావులను జిల్లా కార్యవర్గంలోకి తీసుకోవడం జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు.