వరంగల్

‘చల్లా’ ప్రతిపాదనల మేరకే నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, ఆగస్టు 10: ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రతిపాదనల మేరకే ఆయా వార్డులకు నిధులు కేటాయించినట్లు పరకాల మున్సిపల్ చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాత పోస్టుమార్టం రోడ్డు అధ్వానంగా ఉందని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జరిగిన రైతు సమన్వయ సమితి సమావేశం లో రైతులు, స్థానికులు రోడ్డు పరిస్థితిపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి దృష్టికి తీసు కవచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే రైతులకు, స్థానికులకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారని దానిలో భాగంగానే అధ్వానంగా ఉన్న రోడ్డు కు ఎమ్మెల్యే ప్రతిపాదనల మేరకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని అనడం సరైన పద్దతి కాదన్నారు. పార్టీల కతీతంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అధ్వానంగా ఉన్న రోడ్డుకు నిధులు కేటాయించడం తప్ప అని ప్రశ్నించా రు. తనపై ఆరోపణలు చేసిన వారి వార్డులకు రూ.20 లక్షల వరకు నిధు లు కేటాయించానని తెలిపారు. పరకాల అభివృద్ధిలో అందరు భాగస్వా మ్యం కావాలని అందరి సహకారం తో ముందుకు వెళ్లుతున్నట్లు చెప్పా రు. కలెక్టర్ ఇచ్చిన నిధులు కాబట్టి కలెక్టర్ ఆదేశాల మేరకు అంశాలను ఆమోదించి కలెక్టర్‌కు పంపుతున్నట్లు తెలిపారు. అనంతరం వైస్ చైర్మన్ దేవునూరి రమ్యక్రిష్ణ మాట్లాడుతూ చైర్‌పర్సన్ రాజభద్రయ్యపై అసభ్య పరిచే విధం గా మాట్లాడుతున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదన్నారు. అసభ్య పరిచే విధంగా వ్యవహరించిన వారిని సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో కౌన్సిలర్లు పంచగిరి జయమ్మ, కొయ్యడ మల్లికాంబ, ఆకు ల లక్ష్మీ, బండారి కవిత, దేవునూరి మేఘనాధ్, ఆకుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

నిర్వాసితులను ఆదుకుంటాం: డీఆర్వో
మల్హర్, ఆగస్టు 10: తాడిచెర్ల, కాపు రం గ్రామాలలో ఏర్పాటుచేసిన ఏఎమ్మార్ కంపెనీ భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చి ఆదుకుంటామని జిల్లా రెవె న్యూ అధికారి మోహన్‌లాల్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కాపురం గ్రామంలో ఇంటింటికీ తిరిగి విచారణ చేపట్టారు. పరిహారం పొం దిన ఇండ్లను, పరిహారం పొందని ఇం డ్లను పరిశీలించి వ్యత్యాసం లేకుండా అందరికీ సమాన న్యాయం చేస్తామని భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. 2010 సంవత్సరంలో అంచనా ప్రకా రం వచ్చిన నిధులను కొత్త చట్టం 2011లో వచ్చిన పరిహారానికి రెట్టింపుగా పరిహారం చెల్లించే విధంగా తాము సిద్ధంగా ఉన్నామని భూనిర్వాసితులకు భరోసా ఇచ్చారు. పంచాయతీ రాజ్ అధికారుల సర్వే ప్రకారం వత్యాసం ఏర్పడిందని అధిక మొత్తం వచ్చిన పరిహారం నుంచి రికవరీ చేసి, పరిహారం రాని వారికి అందజేస్తామని అన్నారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు మాట్లాడుతూ గిరిజనులమైన తమకు జిల్లా కలెక్టర్, ఆర్డీఓ కృషి వల్ల తమకు కొత్త చట్టం ప్రకారం పరిహారం ఇప్పించేందుకు అంగీకరించిన వారికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీరబ్రహ్మచారీ, తహాశీల్ధారు మామిడి అశోక్ కుమార్, పంచాయతీ రాజ్ అధికారి కిరణ్‌తో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.