వరంగల్

కెనాల్ నీటితో రైతులను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్కతుర్తి, ఆగస్టు 10: కెనాల్ నుండి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని, మాయ మాటలతో రైతుబంధు, రైతుబీమా రెండూ ఎన్నికల స్టంటేనని, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కెనాల్ నుండి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. రైతులు వర్షాలు లేక ఇప్పటివరకు వరినాట్లు కూడా వేయకుండా ఇబ్బంది పడుతుంటే కెనాల్‌లో నీరు ఉన్నా రైతులకు నీటిని విడుదల చేయకుండా మాయ మాటలు చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంతాజి, పాక రమేష్, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

శతాధిక వృద్ధురాలి మృతి
కురవి, ఆగస్టు 10: శతాధిక వృద్ధురాలు మృతిచెందిన సంఘటన కురవి మండలంలోని గుండ్రాతిమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పెద్దబోయిన సాయమ్మ(115) అనే వృద్ధురాలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, శుక్రవారం మృతిచెందింది. మృతురాలికి నలుగురు కుమారులు ఉన్నారు.