వరంగల్

శిల్పకళా వైభవానికి ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 13: శతాబ్ధాల కాకతీయ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచింది. ఇంత వరకు మన్నులో దాగిన మహాద్భుత కాకతీయ శిల్ప విన్యాసం స్థానికులనే కాదు పురవాస్తు ప్రేమికులకు, సరికొత్త పరిశోధకులకు దారి చూపిం ది. దిల్లీ సూల్తాన్ల కాలంలో కాలగర్భంలో కలిసిపోయి శతాబ్ధాల అనంతరం బయటపడిన కాకతీయ శిల్ప కీర్తి తోరణం విజయకేతంగా నిలిచింది. ప్రఖ్యాత శైవ క్షేత్రులలో ఒకటిగా విరజిల్లుతున్న ఐనవోలు మల్లిఖార్జున స్వామి దేవాలయంకు చెందిన నాలుగవ తోరణం వెలుగులోకి వచ్చింది. 2016 సంవత్సరంలో ఐనవోలు మల్లన్న సిగలో చంద్రవంక వెలుగుచూసింది. అది మూడో కిర్తి తోరణంగా బయటపడింది. కాకతీయ శిల్ప సంపదకు అద్దం పట్టే ఈ తోరణం భూమి పోరల మాటున వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో ఐనవోలు ఆలయ ప్రాంగణంలో ఇరువైపుల రెండు తోరణాలు భక్తులకు దర్శనం ఇస్తే మరో తోరణం కిందికి ఒరిగి ఉండి పోయింది. రెండు తోరణాలు మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తుండగా మరో తోరణం అనావాళ్లు ఇప్పటిదాక కనిపించకుండా పోయింది. ఇంత కాలం తోరణాలలో కొంత భాగం నెలలో కూరుకపోయింది. ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో గతంలో నవీకరణ పనులు చేపట్టారు. ఆలయానికి తూర్పు, పడమర, ఉత్తర దక్షణ, ఈ నాలుగు దిక్కులలో ఆలయానికి ఈ కీర్తి తోరణాలు ఉండేవని స్పష్టం అవుతుంది. అయితే దిల్లీ పాలకుల హాయంలో ధ్వంసం అయిన ఈ శిల్ప సంపదలో ఈ కీర్తి తోరణం ఒకటని గుర్తించారు. 1363 నుండి కాలగర్భంలో కలిసిపోయిందని తెలుస్తుంది. ఇన్ని శతాబ్ధల అనంతరం ఈ తోరణం వెలుగుచూడడం విశేషం. గత సంవత్సరం నుండి రాష్ట్ర పురవాస్తు శాఖ ఆధ్వర్యంలో 46 లక్షల అంచనా వ్యయంతో పునరుద్దరణ పనులు జరిగాయి. ఇటీవలె మొత్తం తోరణాన్ని నిలబెట్టారు. కాగా ఆగస్టు 14వ తేదిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదుగా ఈ తోరణాన్ని అవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పురవాస్తు శాఖ సంచాలకులు ఎన్‌ఆర్ విశాలాక్షి, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, పురువాస్తు , దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.