వరంగల్

పరిపూర్ణనందపై నిషేదం ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, ఆగస్టు13: హైదరాబాదులో పరిపూర్ణానంద స్వామి పై విధించిన నిషేదాన్ని వెంటనే ఎత్తివేయాలని భారతీయ జనతా పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మ అన్నారు. పరిపూర్ణానంద స్వామిపై తెలంగాణ ప్రభుత్వం విధించిన నగర బహిష్కరణను ఎత్తివేయాలని విశ్వహిందూపరిషత్ రాష్టక్రమిటి పిలుపు మేరకు సోమవారం బీజేపీ అర్బన్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ల ముట్టడి కార్యక్రమాన్ని అదాలత్ కూడలిలో ప్రారంభించారు. ర్యాలీ ప్రారంభంలోనే స్థానిక పోలీసులు అడ్డుకుని స్థానిక పోలీస్టేషన్‌కు తరలించి సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అనంతరం రావుపద్మ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నాటినుండి రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుండి రాష్ట్భ్రావృద్ధికి కోట్లాది రూపాయలు వచ్చాయని వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత పథకాలకు మరలించి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

హామీలను నెరవేర్చాలి
* మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు * సీపీఐ రాష్టక్రార్యదర్శివర్గ సభ్యులు వెంకట్రాములు
వడ్డేపల్లి, ఆగస్టు13: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేసి, నేటికీ హామీలను నెరవేర్చడం లో పూర్తిగా విఫలం అయ్యాయని సీపీఐ రాష్టక్రార్యదర్శివర్గసభ్యులు వెంకట్రాములు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్టక్రమిటి పిలుపు మేరకు సోమవారం హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కునుండి రూరల్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీ మొదలై నక్కలగుట్ట కూడలికి చేరుకోగానే స్థానిక పోలీసులు అడ్డుకోవడంతో నాయకులకు, పోలీసులకు కొంత సేపు వాగ్వాదం జరగి ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా వెంకట్రాములు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజలకు చేసింది ఏమి లేదని విమర్శించారు. దేశంలో మతసామరస్యాలను విచ్చిన్నం చేసి దేశ ఐక్యతకు, సమగ్రతకు కేంద్ర ప్రభు త్వం విఘాతం కలిగిస్తుందని మండి పడ్డారు. నిత్యావసర ధరలను విపరీతంగా పెంచి పేద ప్రజలపై పెను భారాన్ని మోపారని అన్నారు. టెక్స్‌టైల్ పార్కును వెంటనే పూర్తిచేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని, అధిక ధరలను నియంత్రించి పెట్రోల్, డిజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకరావాలని, పోడురైతులకు పట్టాలిచ్చి రైతుబంధు పథకం అమలు చేయాలని, విభజన హామీలను వెంటనే తక్షణమే అమలు చేయాలని, అర్హులైన పేద ప్రజలందరికీ రెండుపడక గదుల ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకుల రమేష్, సదాలక్ష్మీ, సాంబయ్య, వీరస్వామి, గోవర్దన్, శ్రీనివాస్, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.