వరంగల్

ఎన్నికల హామీలు మరిచిన ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఆగస్టు 13: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారని, మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్తహామీలు ఇచ్చి మోసాలు చేయడానికి సిద్ధం అవుతున్నారని ఆరోపిస్తూ హామీల అమలుకు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. మహబూబాబాద్‌జిల్లా కేంద్రంలో సోమవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలుదేరిన ఆపార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసు లు అడ్డగించి కలెక్టరేట్‌కు రాకుండానే అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీకి నాయకత్వం వహిస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు తమ్మినేని విశే్వశ్వర్‌రావు, మున్సిపల్ ఫ్లొర్‌లీడర్ అజయ్‌తోపాటు అనేక మందిని అదుపులోకి తీసుకొని టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు అవుతున్నా అమలులో మాత్రం ఘోరంగా విఫలమైయ్యారన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం మాటల గారడీగా మారిపోయిందన్నారు. దళితులకు మూడెకరాల భూమి ముచ్చటను ఈ ప్రభుత్వం మరచిపోయిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ఏ ఒక్క వర్గానికి ఈ ప్రభుత్వం వల్ల మేలు జరుగుడం లేదన్నారు. నియంతలా వ్యవహరిస్తూ ప్రశ్నించేవర్గాలను అణిచివేసే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అరెస్ట్‌లు, అణిచివేతలతో ప్రజల ఆగ్రహాన్ని, ఉద్యమాలను ఆపలేరని, అణిచివేసిన కొద్ది మరింత తీవ్రస్థాయిలో ప్రజల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు నల్లు సుధాకర్‌రెడ్డి, చింతకుంట్ల వెంకన్న, వీరవెల్లి రవి, నాగేశ్వర్‌రావు, పెరుగు కుమార్, సాంబలక్ష్మి పాల్గొన్నారు.