వరంగల్

జవాన్లకు అండగా నిలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, ఆగస్టు 13: ఆర్మీ జవాన్లకు ప్రతి ఒకరూ అండగా నిలవాలని నర్సంపేట ఏసీపీ సునీతా మోహన్ కోరారు. నర్సంపేట పట్టణంలోని డఫోడి ల్స్ ఉన్నత పాఠశాలలో ‘ఆర్మీ అకౌంట్‌లో ఒక రూపాయి వేద్దాం - ఆర్మీ జవాన్లకు అండగా నిలుద్దాం’ అనే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఏసీపీ సునీతా మోహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ రక్షణ కోసం ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని కొనియాడారు. విరాళంగా సేకరించిన 30,116 రూపాయలను ఏసీపీ చేతుల మీదుగా పాఠశాల కరస్పాండెంట్ చింతల నరేందర్ ఏఎస్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎరబోయిన రాజశేఖర్‌కు అందజేశారు. ఇటీవల పాఠశాలలో ఎన్నికైన స్కూల్ లీడర్స్‌కు ఏసీపీ సునీతా మోహన్ చేతుల మీదు గా సర్ట్ఫికెట్లు ప్రధానం చేశారు. ఈకార్యక్రమంలో కరస్పాండెంట్, డైరెక్టర్ చింతల సాయికీర్తన, ప్రిన్సిపాల్ విజయలక్ష్మీ, కిరణ్మయి, కీర్తి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని భర్తరఫ్ చేయాలి
* సీపీఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి
జనగామ టౌన్, ఆగస్టు 13: మహిళా వీఆర్‌వోను రాత్రి సమయంలో తన ఇంటికి వెళ్ళి బెదిరించిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ముఖ్యమం త్రి కేసీఆర్ వెంటనే భర్తరఫ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. సోమవా రం ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి బొట్ల శేఖర్ అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడుతూ పెంబర్తి గ్రామంలో తన అనుచరుల పేరుమీద భూమి పట్టా చేయాలని ఎమ్మెల్యే తన అనుచరులతో మహిళా ఉద్యోగి(వీఆర్‌వో) ఇంటికి రాత్రిసమయంలో వెళ్లి వీధిరౌడీలా భయబ్రాంతులకు గురిచేయడం అమానుషమన్నారు. మహిళా ఉద్యోగుల పట్ల దుర్సుగా ప్రవర్తించడం, గత జిల్లా కలెక్టర్ పట్ల సైతం కక్ష్య సాధింపు ధోరణిలో వ్యవహరించారని అయినప్పటికీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే తీరుపై సీపీ ఎం ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శ్రీనివాస్, నాయకులు రాపర్తిరాజు, ఆహల్య, గోపి, ఉపేందర్, ప్రజా సంఘాల నాయకులు ప్రకాష్, సుధాకర్ పాల్గొన్నారు.

రాష్ట్ర బీసీ మహిళ సంక్షేమ సంఘం కార్యదర్శిగా జయమ్మ
పరకాల, ఆగస్టు 13: తెలంగాణ బీసీ మహిళ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పరకాల పట్టణానికి చెందిన పంచగిరి జయమ్మను నియమిస్తూ సోమవారం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సం దర్భంగా పంచగిరి జయమ్మ మాట్లాడుతూ సంపన్న వర్గాల అణిచివేతతో కనీసం హక్కల సాధనలో బీసీలు పోరాటాలు చేయక తప్పడం లేదన్నారు. ప్రభుత్వం వద్ద ఎన్నో డిమాండ్‌లతో కూడినటువంటి వినతులు ఇచ్చినప్పటికి ఇప్పటి వరకు బీసీల సంక్షేమం, భవితవ్యంపై ఏలాంటి ఉత్తర్వులు జారీ చేయక పోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ ద్వారా ప్రతి యేట రూ. 20 వేల కోట్ల నిధులు కేటాయించాలని, సంక్షేమం నుండి 100% సబ్సీడి క్రింద బ్యాంకు లింకేజి లేకుండా మహిళలకు రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. తన నియామకంపై హర్షం వ్యక్తం చేస్తు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.