వరంగల్

జీపీ కార్మికులకు న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, ఆగస్టు 16: గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జీపీ సిబ్బంది గురువారం జనగామ కలెక్టర్ కార్యాలయం గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న వందలాదిమంది కార్మికులు జనగామ చేరుకొని స్థానిక కలెక్టర్ కార్యాలయం గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించి సుమారు 2గంటల పాటు ఆందోళన చేశారు. కార్మికులు నినాదాలు చేస్తూ కార్యాలయంలోకి చొచ్చుకుపోయే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకొని నివారించారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు కాస్త తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొట్ల చిన్నశ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది తమకు న్యాయం చేయాలని 25రోజులుగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని పదేపదే ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజల వలె కనిపించడం లేదా అని విమర్శించారు. ఇప్పటికైనా వీరి సమస్యలు పరిష్కరించని పక్షంలో రానున్న రోజుల్లో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ కూడా మాట్లాడారు.