వరంగల్

వాజపేయ మృతితో గూడూరులో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఆగస్టు 16: భారత రత్న, మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత వాజపేయి మృతితో గూడూరు మండలంలో విషాదం అలుముకుంది. గూడూరు మండలంలోని గోవిందాపురం గ్రామానికి చెందిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాధవపెద్ది రాఘవేందర్‌రెడ్డితో మాజీ ప్రధాని వాజ్‌పేయికు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అగ్రకులంలో జన్మించిన మాధవపెద్ది రాఘవేందర్‌రెడ్డి ఆర్ధికంగా స్థితిమంతుడు. ఇదే సమయంలో పేదలకు అండగా ఉండి గూడూరు పాత తాలుకాలో పట్టు సాధించాడు. హన్మకొండలో సైతం రాఘవేందర్‌రెడ్డికి పెద్ద భవంతి ఉంది. స్వగ్రామమైన గోవిందాపురంలో కొన్ని రోజులు హన్మకొండలో కొన్ని రోజులు రాఘవేందర్‌రెడ్డి ఉండేవారు. బీజేపీలో చేరన రాఘవేందర్‌రెడ్డి అనతి కాలంలోనే జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈక్రమంలో అప్పట్లో వాజ్‌పేయి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇదే సమయంలో వాజ్‌పేయితో రాఘవేందర్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వరంగల్ జిల్లా పర్యటనకు మూడు పర్యాయాలు వాజ్‌పేయి రాగా రెండు పర్యాయాలు రాఘవేందర్‌రెడ్డి ఇంట్లోనే అల్పాహారం, భోజనం చేశారు. కాగా 1990 జనవరి 16న ఓ విప్లవ గ్రూపు నక్సల్స్ మాధవపెద్ది రాఘవేందర్‌రెడ్డిని హత్య చేశాయి. ఈ క్రమంలో రాఘవేందర్‌రెడ్డి దశదిన కార్యక్రమాలు పూర్తియిన తర్వాత 12వ రోజు వాజ్‌పేయి ఢిల్లీ నుండి సూపర్‌ఫాస్ట్ రైలులో మహబూబాబాద్‌కు వచ్చారు. అక్కడి నుండి కారులో గోవిందాపురంకు చేరుకుని మాధవపెద్ది రాఘవేందర్‌రెడ్డి కుటుంభాన్ని పరామర్శించారు. రాఘవేందర్‌రెడ్డి కుటుంభాన్ని పరామర్శించే క్రమంలో వాజ్‌పేయి హిందీలో మాట్లాడగా వెంకయ్యనాయుడు తెలుగులో అనువాధం చేశారు. రాఘవేందర్‌రెడ్డి కుమారుడు రమేష్ చందర్‌రెడ్డితో వాజ్‌పేయి ప్రత్యేకంగా మాట్లాడారు. వాజ్‌పేయి చూసేందుకు అప్పట్లో వేల మంది గోవిందాపురంకు సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, ఎడ్ల బండ్లు, కాలినడక వెళ్లారు. సాయంత్రం వరంగల్ నగరంలో జరిగిన బహిరంగసభలో వాజ్‌పేయి పాల్గొని ఢిల్లీకి వెళ్లిపోయారు. వాజ్‌పేయి వెంట బీజేపీ అగ్రనేతలైన వెంకయ్యనాయుడు, బంగారు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయలు వచ్చారు. వాజ్‌పేయి గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారనే విషయం తెలుసుకున్న మండల ప్రజలు గోవిందాపురంకు వచ్చిన సమయంలో జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.